తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో రాష్ట్ర విద్యాశాఖ ప్రముఖ NGO సంస్థలతో MOU కుదుర్చుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో అధునాతన ఎడ్ టెక్ సదుపాయాలను అందించనుంది ప్రభుత్వం. నందన్ నీలేకణి నేతృత్వంలోని ఎక్స్టెప్ ఫౌండేషన్, అలక్ పాండే అధ్వర్యంలోని ఫిజిక్స్ వాలా, డాక్టర్ సునీతా కృష్ణన్ నేతృత్వంలోని ప్రజ్వల ఫౌండేషన్, సఫీనా హుస్సేన్ అధ్వర్యంలోని ఎడ్యుకేట్ గర్ల్స్, ఖాన్ అకాడమీ, షోయబ్దార్ నిర్వహిస్తున్న పైజామ్ పౌండేషన్ లాంటి పేరొందిన సంస్థలతో రాష్ట్ర విద్యాశాఖ MOU కుదుర్చుకుంది.

