మారుమూల తండాలో పుట్టి, పెరిగిన గిరిజన బిడ్డ.. ప్రగతి రథం స్టీరింగ్ చేతపట్టి చరిత్ర సృష్టించింది. దేశంలోనూ, తెలంగాణలోనూ తొలి మహిళా ఆర్టీసీ డ్రైవర్‌గా రికార్డులకేక్కింది. ఇటీవలే ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ నుంచి తెలంగాణ ఆర్టీసీలో చేరింది. తొలిరోజు ఎంజీబీఎస్ నుంచి మిర్యాలగూడకు బస్సు నడిపి శభాష్ అనిపించుకుంది. 2015లో ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పోరేషన్ (డీటీసీ)లో బస్సు డ్రైవర్‌గా సరిత సెలక్ట్ అయ్యింది. ఢిల్లీ ట్రాన్స్‌పోర్టులో సరిత ఒక్కరే మహిళా డ్రైవర్.

