మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఐపీఎల్లో సన్ రైజర్స్ సీఈవోగా వ్యవహరిస్తోన్న కావ్యా మారన్‌తో పెళ్లి అంటూ ప్రచారం సాగుతోంది. అనిరుధ్, కావ్యా మారన్ రిలేషన్ షిప్లో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారని కోలీవుడ్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. వీటిపై తాజాగా అనిరుధ్ స్పందిస్తూ కావ్యతో పెళ్లి వార్తలను ఖండించారు. ‘పెళ్లా?.. రూమర్స్ ప్రచారం ఆపండి’ అంటూ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు.

