తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక ఘనంగా ప్రారంభమైంది. హైదరాబాద్ హైటెక్స్ వేదికగా జరుగుతున్న ఈవెంట్కు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి, ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు సహా ఇతర రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దిల్ రాజు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

