గ్రామీణులకు సేవలు అందిస్తున్న స్వచ్ఛంద సంస్థ. విద్యా, వైద్యం వంటి విషయాల్లో గత కొన్నేళ్లుగా సేవలు అందిస్తూ రాయలసీమవాసులకు, ముఖ్యంగా పేదల పాలిట వరంగా పేరొందిన రూరల్ డెవలప్మెంట్ ట్రస్టు (ఆర్డీటీ) విదేశీ నిధుల వినియోగానికి ఆర్డీటీకి కేంద్రం అనుమతులు నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఆర్డీటీ సేవల కొనసాగింపుపై ఆందోళన వ్యక్తమవుతోంది. పేదల పాలిట వరమైన రూరల్ డెవలప్మెంట్ ట్రస్టు (ఆర్డీటీ) సేవలు ఆగవని క్లారిటీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో ఆర్డీటీ విషయమై సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు.

