ముఖ్యంగా రెడ్ ఫోర్ట్ ను టార్గెట్ చేసుకొవడం సాయంకాలంలో పేలుడు సంభవించడం వెనుక భారీ ఉగ్రకుట్ర ఉందని కారులో భారీగా పేలుడు పదార్థాలు తీసుకొని వచ్చి మరీ ముందుగా ఎంచుకున్న విధంగా రెడ్ ఫోర్ట్ సమీపంలో పేలుడును జరిపిఉండొచ్చని రిమోట్ తో ఏమైన పేలుడు చేశారా..?.. అన్న కోణంలో కూడా అధికారులు విచారణ ప్రారంభించారు. ముఖ్యంగా ఢిల్లీలో సోమవారం హలీడే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎర్రకోట వద్ద ప్రజల రద్దీ ఒకింత తక్కువగా ఉంటుంది.ఇతర రోజులలో అయితే..పరిస్థితి మరీ దారుణంగా ఉండేది

