ముంబై ఇండియన్స్ హిట్టర్ల విధ్వంసానికి వాంఖడే స్టేడియం మరోసారి వేదికైంది. సన్రైజర్స్ తో జరిగిన మ్యాచ్లో రియాన్ రికెల్టన్ కేవలం 44 బంతుల్లోనే శతకం బాది, ముంబై జట్టు తరపున అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. పాత రికార్డులన్నీ ఈ ప్రవాహంలో కొట్టుకుపోయాయి. గత 18 ఏళ్లుగా శ్రీలంక దిగ్గజం సనత్ జయసూర్య పేరిట ఉన్న రికార్డును తాజాగా రియాన్ రికెల్టన్ తిరగరాశాడు. 2008లో జయసూర్య 45 బంతుల్లో సాధించిన ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును, రికెల్టన్ 44 బంతుల్లోనే అధిగమించాడు.

