సొంతగడ్డపై హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లకు అభిషేక్ శర్మ చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఎడాపెడా బౌండరీలు, భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 15 బంతుల్లోనే అద్భుతమైన అర్ధ శతకం సాధించి, ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. స్పిన్నర్లు, పేసర్లు అనే తేడా లేకుండా అందరినీ దారుణంగా శిక్షించాడు. బంతి పడటమే ఆలస్యం అన్నట్లుగా కళ్లు చెదిరే కట్ షాట్లు, కవర్ డ్రైవ్ లు, భారీ సిక్సర్లతో మైదానాన్ని హోరెత్తించాడు.

