అమెరికా ప్రభుత్వం 6,000 మందికి పైగా విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేసింది. ఇందులో ఎక్కువగా భారతీయ విద్యార్థులు ఉన్నారు. అమెరికా విదేశాంగ శాఖ సమాచారం ప్రకారం, దాదాపు 4,000 వీసాలు చట్ట ఉల్లంఘనల కారణంగా రద్దయ్యాయి. వీటిలో డ్రంక్ అండ్ డ్రైవ్, దొంగతనం, చిన్న నేరాలు ఉన్నాయి. ఇంకా 200–300 వీసాలను టెర్రరిస్ట్ గ్రూపులకు మద్దతు ఇచ్చారన్న కారణంతో రద్దు చేశారు.

