ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని 50 రోజుల్లో ఆపకుంటే రష్యాపై భారీ సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. యుద్ధాలను ఆపడానికి తాను వాణిజ్యాన్ని చాలా బాగా ఉపయోగించుకుంటానని స్పష్టం చేశారు. గతంలో భారత్-పాకిస్థాన్ మధ్య ఘర్షణను ఆపడానికి సుంకాల బెదిరింపులే పని చేశాయని గుర్తు చేశారు. పుతిన్ పగలు బాగా మాట్లాడి రాత్రి దాడులు చేస్తున్నారని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యాకు సహాయం చేసే దేశాలపై కూడా 500 శాతం టారిఫ్‌లు విధిస్తామని వెల్లడించారు.

