రిటైర్డ్ ఐపీఎస్ అధికారి నాగేశ్వర్ రావు ‘సజ్జనర్ యూనిఫాం వేసుకున్న ఒక క్రిమినల్ అని ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. ఆ వ్యాఖ్యలపై సజ్జనర్ పరోక్షంగా స్పందించారు. తన పేరు, హ్యాష్‌ట్యాగ్ పెడితే మైలేజ్ వస్తుందని కొందరు అలా చేస్తున్నారని, సమయం వచ్చినప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుందని పేర్కొన్నారు. వీటన్నింటిపై కచ్చితంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తన 26 ఏళ్ల సర్వీసులో ఏం చేశానోప్రజలందరికీ తెలుసన్నారు. 26 ఏళ్లలో 20 పోస్టింగ్‌లు వచ్చాయని, ఏ పోస్టింగ్ ఇచ్చినా తగ్గేది లేదని చెప్పుకొచ్చారు.

