రంజాన్
పవిత్ర దైవ గ్రంథం ఖురాను అవతరించినది “రమదాన్” మాసంలోనే …రమదాన్ పండుగ కు మరో పేరు “ఈద్ ఉల్ ఫిత్ర”. ఈ నెలలో ముస్లింలు భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు ఫిత్రా జకాత్ దానధర్మాలు చేస్తుంటారు. చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ కేలండర్ తొమ్మిదవ నెల “రమదాన్”, దీనిని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దానికి ప్రధానమైన కారణం ‘ దివ్య ఖురాన్’ గ్రంథం ఈ మాసంలో అవిర్భవించడమే! క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే “రమదాన్” మాసం

