loader

ఏపీలో 27 ప్రాజెక్టులు…22,407 మందికి ఉద్యోగావకాశాలు: సీఎం చంద్రబాబు నాయుడు

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 15వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో ఐటీ, విద్యుత్, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, మౌలిక సదుపాయాలు, పరిశ్రమల రంగాలకు చెందిన 27 ప్రాజెక్టుల ప్రతిపాదనలకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. రూ.29,021 కోట్ల విలువైన ప్రాజెక్టులకు 15 వ ఎస్ఐపిబి సమావేశం ఆమోదం తెలియచేసింది. రాష్ట్ర ప్రభుత్వంతో ఇప్పటివరకు ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థల యాజమాన్యాలతో అధికారులు నిరంతరం సంప్రదింపులు జరిపి ప్రాజెక్టుల పనులు సకాలంలో పూర్తి చేసేలా చూడాలన్నారు.

బాల్క సుమన్‌కు 14 రోజుల రిమాండ్.. అదిలాబాద్ జైలుకు..!

చెన్నూర్ నియోజకవర్గంలోని క్యాతన్ పల్లిలో జరిగిన ఘటనలో అరెస్టైన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు కోర్టు రిమాండ్ విధించింది. 14 రోజులు అనగా.. మార్చి 3 వరకు ఆయనకు రిమాండ్ విధిస్తున్నట్టు గురువారం మంచిర్యాల కోర్టు వెల్లడించింది. పోలీసులు బాల్క సుమన్‌ను ఆదిలాబాద్ జైలుకు తలరించనున్నారు. మంగళవారం శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. దాంతో, బుధవారం పోలీసులు మాజీ ఎమ్మెల్యేను అదుపులోకి తీసకున్నారు.

రంజాన్ మత సామరస్యానికి ప్రతీక: సిఎం రేవంత్ రెడ్డి

పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ముస్లిం సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర మాసంలో ముస్లింలు ఆచరించే ఉపవాస దీక్షలు, ప్రార్థనలు ఆధ్యాత్మికతను పెంపొందిం చడంతో పాటు క్రమశిక్షణను పెంచుతాయన్నారు. లౌకికవాదం, మత సామరస్య పరిరక్షణలో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని సిఎం అన్నారు. ముస్లిం సోదరులు రంజాన్‌మాసం సంతోషంగా జరుపుకొని, అల్లా దీవెనలు పొందాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

ఢిల్లీ ఎక్స్‌పో సమ్మిట్ గిన్నిస్ రికార్డు

ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సదస్సు, ప్రదర్శన గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి చేరింది. తాము బాధ్యతాయుతంగా ఈ ఏఐ పరిజ్ఞానం వినియోగిస్తాం, దుర్వినియోగపర్చబోం అని ప్రతిన వహిస్తూ2,50,946 మంది యువజనం ప్రకటించారు. ఇది గిన్నిస్ రికార్డుల్లో చేరిందని రికార్డు నిర్వాహకులు ప్రవీణ్ పటేల్ బుధవారం తెలిపారు. కేవలం 24 గంటల వ్యవధిలో ఈ భారీ సంఖ్యలో జనం ప్రతిజ్ఞ తీసుకున్నారు.

ప్రధాని మోడీ ఏర్పాటు చేసిన ప్రత్యేక విందుకు సిఎం రేవంత్‌రెడ్డి హాజరు

దేశ రాజధానిలోని భారత్ మండపంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ – 2026’ లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఏర్పాటు చేసిన ప్రత్యేక విందుకు సిఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సదస్సుకు ఓపెన్ ఏఐ సీఈఓ శ్యామ్ ఆల్ట్మాన్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వంటి గ్లోబల్ టెక్ లీడర్లతో పాటు సుమారు 40 మందికి పైగా అంతర్జాతీయ కంపెనీల సీఈఓలు హాజరయ్యారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఐటీ మంత్రులు, 45కు […]

చంచల్‌గూడ జైలు నుంచి ఐబొమ్మ రవి విడుదల

సినిమాల పైరసీ కేసులో ‘ఐబొమ్మ’ రవి చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యాడు. తెలంగాణ హైకోర్టు మంగళవారం అతడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇమంది రవి ఎట్టి పరిస్థితుల్లోనూ దేశం విడిచి వెళ్లొద్దని తన పాస్‌పోర్టును కోర్టులో సరెండర్ చేయాలని ఆదేశించింది. ప్రతి రోజు ఉదయం 11 గంటలకు సిసిఎస్ పోలీసుల ఎదుట హాజరు కావాలని స్పష్టం చేసింది. ఈ కేసులో గతేడాది నవంబర్‌లో రవి అరెస్టయిన విషయం తెలిసిందే.

రాబోయే 24 గంటల్లో కుండపోత.. గంటకు 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు

దేశంలో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి… చలి పూర్తిగా తగ్గి ఎండలు మొదలయ్యాయి. భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ ప్రకటించింది. అల్పపీడనం కారణంగా ఫిబ్రవరి 20న దక్షిణ తమిళనాడు, తీరప్రాంతాలు, పుదుచ్చేరి, కారైకాల్‌లోని కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫిబ్రవరి 21, 22 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ […]

ముస్లిం సోదరులకు కేసీఆర్ రంజాన్ మాస శుభాకాంక్షలు

ఇస్లాం మతస్తులు పవిత్రంగా భావించే రంజాన్ మాసం ప్రారంభ దినం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర ఉపవాస దీక్షలతో, ప్రత్యేక ప్రార్థనలు, దైవభక్తితో సాగే రంజాన్ మాసంలో ఆధ్యాత్మికత, భక్తి భావన వెల్లివిరుస్తుందని తెలిపారు. తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ నగరం గంగాజమునా తెహజీబ్‌ కు దర్పణంగా నిలుస్తుందని వెల్లడించారు.

అటవీ శాఖ అధికారి, మహిళపై వ్యక్తి కాల్పులు.. ఆ తర్వాత ఆత్మహత్య

అటవీశాఖ అధికారితోపాటు మహిళపై ఒక వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపాడు. పారిపోయిన అతడు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాల్పుల్లో గాయపడిన డిప్యూటీ ఫారెస్ట్ రేంజర్, ఆ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భోపాల్‌ వాంఖేడి గ్రామంలోని అటవీ శాఖ మాజీ ఉద్యోగి పురాన్ అలియాస్ గుడ్డా లోధి మూడేళ్ల కిందట అతడు అక్కడ పని చేశాడు. అయితే దురుసు ప్రవర్తన వల్ల ఉద్యోగం నుంచి అతడ్ని తొలగించారు. తిరిగి పనిలో చేర్చుకోమని ఆగ్రహంతో కాల్పులు […]

కనిపించిన నెలవంక…రేపటి నుంచి రంజాన్ ఉపవాసాలు

రంజాన్ మాసపు నెలవంక బుధవారం కనిపించింది. ఢిల్లీ, హైదరాబాద్, ముంబైలలో రంజాన్ నెలవంక కనిపించిందని సెంట్రల్ రూట్- ఎ- హిలాల్ కమిటీ ప్రకటించింది. దీంతో గురువారం నుండి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం అవుతున్నాయి. రంజాన్ నెలవంక దర్శనంతో తరావి నమాజ్ ప్రత్యేక ప్రార్థనలు బుధవారం నుండే ప్రారంభమయ్యాయి. ఉపవాస దీక్షలు నెల రోజుల పాటు కొనసాగుతాయి. నెల రోజుల ఉపవాస దీక్షల అనంతరం ముస్లిం సోదరులు భక్తి శ్రద్దలతో ఈద్ ఉల్ ఫితర్ (రంజాన్ పండుగ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON