ఇస్లాం మతస్తులు పవిత్రంగా భావించే రంజాన్ మాసం ప్రారంభ దినం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర ఉపవాస దీక్షలతో, ప్రత్యేక ప్రార్థనలు, దైవభక్తితో సాగే రంజాన్ మాసంలో ఆధ్యాత్మికత, భక్తి భావన వెల్లివిరుస్తుందని తెలిపారు. తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ నగరం గంగాజమునా తెహజీబ్ కు దర్పణంగా నిలుస్తుందని వెల్లడించారు.

