రంజాన్ మాసపు నెలవంక బుధవారం కనిపించింది. ఢిల్లీ, హైదరాబాద్, ముంబైలలో రంజాన్ నెలవంక కనిపించిందని సెంట్రల్ రూట్- ఎ- హిలాల్ కమిటీ ప్రకటించింది. దీంతో గురువారం నుండి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం అవుతున్నాయి. రంజాన్ నెలవంక దర్శనంతో తరావి నమాజ్ ప్రత్యేక ప్రార్థనలు బుధవారం నుండే ప్రారంభమయ్యాయి. ఉపవాస దీక్షలు నెల రోజుల పాటు కొనసాగుతాయి. నెల రోజుల ఉపవాస దీక్షల అనంతరం ముస్లిం సోదరులు భక్తి శ్రద్దలతో ఈద్ ఉల్ ఫితర్ (రంజాన్ పండుగ ) జరుపుకుంటారు.

