loader

సరిహద్దు వెంబడి మరోసారి పాక్‌ కుట్రలు! 15 డ్రోన్లు కూల్చేసిన ఇండియన్‌ ఆర్మీ

సరిహద్దులో పాకిస్తాన్‌ కుట్రలు కొనసాగుతున్నాయి. LOC దగ్గర పాకిస్తాన్‌ డ్రోన్ల సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. సరిహద్దు గ్రామాల్లో గత కొద్దిరోజులుగా పాకిస్తాన్‌ డ్రోన్లు ఆయుధాలతో పాటు డ్రగ్స్‌ను జారవిడుస్తున్నాయి. ఆర్మీ అధికారులు వెంటనే యాంటీ డ్రోన్‌ సిస్టమ్‌ను యాక్టివేట్‌ చేసి వాటిని ధ్వంసం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మూడోసారి ఆర్మీ డ్రోన్లు కనిపించడం కలకలం రేపింది. నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) సమీపంలోని పూంచ్‌లోని దేగ్వార్ ప్రాంతంలో కొన్ని అనుమానిత పాకిస్తాన్ డ్రోన్‌లను గుర్తించిన భారత […]

పండగ పూట విషాదం.. ప్రాణాల తీసిన మాంజా..

సూరత్‌లో  చంద్రశేఖర్ ఆజాద్ ఫ్లైఓవర్ (జిలానీ బ్రిడ్జ్) పై నుంచి రెహాన్ షేక్ అనే వ్యక్తి తన భార్య రెహానా, కూతురు ఆయిషా(7)తో కలిసి బైక్‌పై  బయలుదేరారు. అంతలోనే రెహాన్ మెడకు గాలిపటం మాంజా చుట్టుకోవడంతో బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో రెహాన్ అతని కూతురు ఆయోషా అక్కడికక్కడే మృతి చెందారు. అతని భార్య రెహానా 70 అడుగుల ఎత్తు నుంచి ఫ్లైఓవర్ కింద ఉన్న ఆటో రిక్షాపై పడింది. తీవ్ర గాయాలు కావడంతో […]

రూ.1.53 కోట్లు గెలిచిన కోడి :గోదావరి జిల్లాల్లో కాసుల వర్షం కురిపిస్తున్న కోడి పందేలు

సంక్రాంతి పండుగ సందర్భంగా తాడేపల్లిగూడెంలోని పైబోయిన వెంకటరామయ్య బరిలో గుడివాడకు చెందిన ప్రభాకర్, రాజమండ్రికి చెందిన రమేశ్‌ల కోళ్ల మధ్య హోరాహోరీగా పందెం జరిగింది. ఈ అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో రాజమండ్రి రమేశ్‌కు చెందిన కోడి విజయం సాధించింది. ఈ పందెంలో రమేశ్ అక్షరాలా రూ.1.53 కోట్లను గెలుచుకున్నారు. ఈ సంక్రాంతికి పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన అతిపెద్ద పందెం ఇదేనని స్థానికులు చర్చించుకుంటున్నారు.

ఫ్యామిలీతో కలిసి సంక్రాంతిని జ‌రుపుకున్న విజ‌య్ దేవరకొండ..

టాలీవుడ్ స్టార్‌ హీరో విజయ్ దేవరకొండ తన కుటుంబంతో కలిసి సంక్రాంతి వేడుకలను ఎంతో వైభవంగా జరుపుకున్నారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో జరిగిన ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలను విజయ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటోల్లో విజయ్ పక్కా ట్రెడిషనల్ లుక్‌లో పంచె కట్టుకుని కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. విజయ్ తన తల్లిదండ్రులు మరియు తమ్ముడు ఆనంద్ దేవరకొండతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇంటి ముందు అందమైన ముగ్గులు, గాలిపటాలతో పండుగ […]

ముంబై మున్సిపల్ ఎన్నికలు.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఏంటంటే..

ముంబై మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎగ్టిట్ పోల్స్ మాత్రం బీజేపీ-శివసేన (ఏక్‌నాథ్ షిండే) కూటమి గెలుస్తుందని అంచనా వేస్తున్నాయి బీజేపీ-శివసేన కూటమి భారీ మెజారిటీతో గెలుస్తుందని యాక్సిస్ మై ఇండియాతో పాటు  జేవీసీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, బీజేపీ-శివసేన కూటమికి 131-151, శివసేన(యూబీటీ)-ఎమ్ఎన్‌ఎస్‌ కూటమికి 58-68,కాంగ్రెస్‌కు 20, బీజేపీ-శివసేన 119 సీట్లల్లో గెలిచే అవకాశం ఉందని సకల్ పోల్ అంచనా వేసింది.

ఇరాన్‌ అల్లర్లు- భారతీయులను తీసుకొచ్చేందుకు సిద్ధమైన కేంద్రం

ఇరాన్ నుంచి భారతీయులను తరలించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. తొలి బృందాన్ని శుక్రవారం భారత్‌కు తీసుకొచ్చే అవకాశం ఉందని సమాచారం. ప్రయాణానికి అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని టెహ్రాన్‌లోని భారత్‌ ఎంబసీ అధికారులు, విద్యార్థులను కోరినట్లు తెలుస్తోంది. అనేక ప్రాంతాల్లో ఇంటర్నెట్ సర్వీసుల నిలిపివేత కారణంగా భారతీయులను సంప్రదించేందుకు ఇబ్బందిగా ఉందని పేర్కొంది. అయితే ఇరాన్‌లో దాదాపు 10వేల మంది భారతీయులు ఉన్నట్లు అంచనా.

‘నాటో’లో సంచలన పరిణామం : గ్రీన్‌లాండ్‌‌కు రక్షణగా ఐరోపా ఆర్మీ

నాటో సైనిక కూటమిలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. అమెరికా బారి నుంచి డెన్మా‌ర్క్‌లోని గ్రీన్‌లాండ్‌‌ ద్వీపానికి భద్రత కల్పించేందుకు ఐరోపా దేశాల సేనలు రంగంలోకి దిగాయి. అణ్వస్త్ర దేశం ఫ్రాన్స్‌తో పాటు జర్మనీ, నార్వే, స్వీడన్ సహా వివిధ ఐరోపా దేశాల సైన్యాలను గ్రీన్‌లాండ్‌ గడ్డపై మోహరించే ప్రక్రియ మొదలైంది. ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం గ్రీన్‌లాండ్‌ను మర్యాదగా తమకు విక్రయించకుంటే, స్వాధీనం చేసుకుంటామని డెన్మార్క్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే హెచ్చరించారు.

అంత‌ర్జాతీయ అంత‌రిక్ష కేంద్రంలో మెడిక‌ల్ ఎమ‌ర్జెన్సీ.. భూమిపైకి క్షేమంగా న‌లుగురు వ్యోమ‌గాములు

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి నలుగురు వ్యోమగాములు సురక్షితంగా భూమిపైకి చేరారు. ఐఎస్‌ఎస్‌లో ఓ వ్యోమగామికి మెడికల్‌ ఎమర్జెన్సీ తలెత్తడంతో మిషన్‌ను ముందుగానే ముగిస్తున్నట్లు ఇటీవల నాసా (NASA) ప్రకటించింది. ఈ నేపథ్యంలో అనారోగ్యానికి గురైన వ్యోమగామి సహా నలుగురు ఆస్ట్రోనాట్‌లతో కూడిన క్రూ-11 డ్రాగన్‌ వాహకనౌక ఎండీవర్‌ గురువారం అమెరికాలోని కాలిఫోర్నియా తీరంలో సముద్ర జలాల్లో సురక్షితంగా దిగింది. అయితే గోప్యతా కారణాలు, ప్రొటోకాల్‌ దృష్ట్యా ఆ వ్యోమగామి పేరు, వైద్య కారణాలను నాసా బయటపెట్టలేదు.

ఇరాన్‌లో అల్ల‌ర్ల అణిచివేత కోసం రంగంలోకి ఇరాక్ మిలీషియా..!

ఇరాన్ లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో ఇప్పటివరకు రెండువేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వేల మంది అరెస్టయ్యారు. ఇలా నిరసనలను అణచి వేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న ఇరాన్‌ ప్రభుత్వం.. దీని కోసం విదేశీ మిలీషియా సాయం తీసుకుంటున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఆందోళనలను అణచి వేసేందుకు వందలాది సాయుధులను నియమించుకొని, టెహ్రాన్‌కు తీసుకువస్తున్నట్లు ఇరాన్‌ ఇంటర్నేషనల్‌ పేర్కొంది. ఇప్పటికే దాదాపు 800 మంది సరిహద్దు దాటి ఇరాన్‌లోకి వచ్చినట్లు తెలిపింది.

కుటుంబంతో క‌లిసి బీఆరెస్ అధినేత‌ కేసీఆర్ సంక్రాంతి సంబురాలు

బీఆరెస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుటుంబంతో క‌లిసి సంక్రాంతి సంబురాలు చేసుకున్నారు. ఎర్రవెల్లిలోని త‌న నివాసంలో ఈ సంబురాలు జ‌రుపుకున్నారు. కేసీఆర్, ఆయ‌న స‌తీమ‌ణి శోభ‌మ్మ‌, కుమారుడు కేటీఆర్‌, కోడ‌లు శైలిమ‌, మ‌నువ‌డు, మ‌నువ‌రాలు సంతోషంగా సంబురాల్లో పాల్గొన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON