loader

సిసి కెమెరాల పర్యవేక్షణలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు

రాష్ట్రంలో ఇంటర్ ప్రాక్టికల్స్‌పై ఈసారి సిసి కెమెరాలు, ఫ్లైయింగ్ స్వాడ్ల బృందాల పర్యవేక్షణలో జరుగనున్నాయి. వచ్చే ఫిబ్రవరి 2 నుంచి 21వ తేదీ వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరంతోపాటు ఒకేషనల్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు ఇంటర్ సైన్స్ గ్రూపులకు చెందిన దాదాపు 4 లక్షల మంది హాజరవుతారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు పకడ్బంధీగా నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు ఏర్పాటు చేస్తోంది.

అర్ధశతకంతో షఫాలీ విధ్వంసం.. హ్యాట్రిక్ విజయాలతో సిరీస్ గెలుపొందిన టీమిండియా…!

వరల్డ్ ఛాంపియన్ భారత జట్టు స్వదేశంలో తొలి సిరీస్ పట్టేసింది.  ఓపెనర్ షఫాలీ వర్మ(79 నాటౌట్) విధ్వంసక అర్ధ శతకంతో చెలరేగగా..  మూడో టీ20లోనూ భారీ విజయంతో సిరీస్ పట్టేసింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆతిథ్య జట్టుకు కనీస పోటీ ఇవ్వలేకపోతున్న లంక త్రివేండ్రంలోనూ చతికిలపడింది. రేణుకా సింగ్(4-21)తో నిప్పులు చెరగగా.. స్వల్ప ఛేదనలో షఫాలీ ఉప్పెనలా విరుచుకుపడింది. అంతే.. 13.2 ఓవర్లలోనే విక్టరీ కొట్టిన భారత్.. మరో రెండు మ్యాచ్‌లుండగానే సిరీస్ పట్టేసింది.

IPL 2026 సీజన్‌కి ముందే యశ్ దయాల్ అరెస్ట్?

ఐపీఎల్ 2025 సీజన్ టైటిల్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆర్‌సీబీ బౌలర్ యశ్ దయాల్, తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఐదేళ్లుగా అత్యాచారం చేస్తున్నాడని యశ్ దయాల్‌పై  పోలీసులకు ఫిర్యాదు చేసింది ఓ మహిళ. అలాగే మరో 17 ఏళ్ల అమ్మాయి కూడా తనపై యశ్ దయాల్,  లైంగిక దాడి పాల్పడినట్టు ఫిర్యాదు చేసింది. posco యాక్ట్‌లో ఇరుక్కున్న యశ్ దయాల్, త్వరలోనే యశ్ దయాల్‌ని అదుపులోకి తీసుకోబోతున్నారు పోలీసులు. ఐపీఎల్ 2026 సీజన్‌లో యశ్ దయాల్ అందుబాటులో ఉండడం అనుమానమే.

పహల్గామ్ దాడి దర్యాప్తుతో పాకిస్థాన్‌కు చుక్కలు.. అమిత్ షా మాస్ వార్నింగ్..

ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించబోమని, దేశ భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఉగ్రవాద వ్యతిరేక సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ.. ఉగ్రవాద మూలాలను దెబ్బతీసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. గత ఏప్రిల్‌లో కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై భారత దర్యాప్తు సంస్థలు చేసిన విచారణ, పాకిస్థాన్‌లోని టెర్రరిస్ట్ మాస్టర్ మైండ్‌లకు ఒక హెచ్చరికలా […]

‘హెచ్1బీ వీసా ఇంటర్వ్యూల ఆకస్మిక రద్దు సరికాదు’- అమెరికా నిర్ణయంపై భారత్ ఆందోళన

ముందస్తుగా షెడ్యూల్ చేసిన భారతీయుల హెచ్1బీ వీసా ఇంటర్వ్యూలను అమెరికా అకస్మాత్తుగా రద్దు చేయడంపై భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఈవిషయాన్ని అమెరికాకు తెలియజేసినట్లు శుక్రవారం వెల్లడించింది.  వేలాది మంది భారతీయ దరఖాస్తుదారులకు డిసెంబరు 15 నుంచి నిర్వహించాల్సిన  హెచ్1బీ వీసా ఇంటర్వ్యూలను అమెరికా ఇమిగ్రేషన్ విభాగం ఇటీవలే కొన్ని నెలల పాటు వాయిదావేసింది. మా సంప్రదింపులు కొనసాగుతున్నాయి’అని శుక్రవారం రోజు  భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.

రేవంత్ తీరు చూస్తే ఎడమ కాలి చెప్పుతో కొట్టాలనిపిస్తుంది- మరోసారి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పేగులు మెడలో వేసుకోవడం, గుడ్లు పీకి గోటీలాడటం వంటి మాటలు ఒక ముఖ్యమంత్రికి తగునా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కుర్చీకి ఉన్న గౌరవాన్ని బట్టి సంయమనం పాటిస్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ సాధించిన నాయకుడు, తన తండ్రి అయిన కేసీఆర్‌ను తిడితే ఒక కొడుకుగా ఆవేశం రావడం సహజమని, రేవంత్ తీరు చూస్తే ఎడమ కాలి చెప్పుతో కొట్టాలనిపిస్తుందని, కానీ ప్రజాస్వామ్యంపై […]

విరాట్ కోహ్లీకి రూ.10 వేల బహుమతి.. బీసీసీఐపై నెటిజన్ల ట్రోల్స్..!

సుమారు 15 ఏళ్ల తర్వాత విజయ్ హజారే ట్రోఫీలోకి అడుగుపెట్టిన కోహ్లీ అద్భుత బ్యాటింగ్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన విరాట్ కోహ్లీని ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు వరించింది. అయితే, అతనికి నగదు బహుమతిగా కేవలం రూ. 10,000 మాత్రమే అందజేశారు. “కోహ్లీ కారు సర్వీసింగ్‌కు కూడా ఈ డబ్బు సరిపోదు” అని ఒకరు, “బీసీసీఐకి అంత కరువు వచ్చిందా?” అని మరొకరు కామెంట్స్ చేస్తున్నారు. అంతర్జాతీయ స్టార్ ఆడుతున్నప్పుడు ఈ మొత్తం […]

యాక్సిడెంట్ ముసుగులో హత్య.. మాజీ సర్పంచ్ కేసులో షాకింగ్ నిజాలు..!

జోగులాంబ గద్వాల్ జిల్లాలో చోటుచేసుకుంది. ధరూర్ మండలం నందిన్నె మాజీ సర్పంచి చిన్న భీమా రాయుడు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మొదట అందరూ దీన్ని సాధారణ రోడ్డు ప్రమాదంగానే భావించారు. కానీ  వారం రోజుల వ్యవధిలోనే కేసును ఛేదించి సంచలన నిజాలను బయటపెట్టారు. పైకి కనిపించిన ప్రమాదం వెనుక రూ.25 లక్షల సుపారీ ఒప్పందం ఉందని, నెల రోజుల పాటు రెక్కీ నిర్వహించి పక్కా స్కెచ్‌తో హత్య చేసినట్లు నిర్ధారించారు. రాజకీయ కక్షలు, భూ […]

అమరావతి: మంత్రి ముందే ఆగిన రాజధాని రైతు గుండె.. విషాదం..

ఏపీ రాజధాని అమరావతిలో ఓ రైతు గుండెపోటుతో మరణించారు. మందడం గ్రామసభలో మంత్రి నారాయణ ఎదుటే తన ఆవేదనను వెళ్లగక్కిన రామారావు అనే రైతు.. తమను ముంచేశారంటూ వాపోయారు. తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ.. అక్కడే కుప్పకులిపోయారు. దీంతో అతడిని వెంటనే మంత్రి కారులో ఆసుపత్రికి తరలించారు. కానీ, ఆలోపే రామారావు మృతి చెందారు. ఈ సంఘటనతో మందడంలో తీవ్ర విషాదం నెలకొంది.

కాచిగూడలోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం.. మంటల్లో కాలి చిన్నారి మృతి…

హైదరాబాద్‌లోని కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుందర్ నగర్‌లో శుక్రవారం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఒక ఇంట్లో ఏసీలో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ సంభవించి పేలడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో  ఓ చిన్నారి మంటలు అంటుకోవడంతో.. అక్కడికక్కడే మృతి చెందగా, మరో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన బాలుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా.. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON