వరల్డ్ ఛాంపియన్ భారత జట్టు స్వదేశంలో తొలి సిరీస్ పట్టేసింది. ఓపెనర్ షఫాలీ వర్మ(79 నాటౌట్) విధ్వంసక అర్ధ శతకంతో చెలరేగగా.. మూడో టీ20లోనూ భారీ విజయంతో సిరీస్ పట్టేసింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆతిథ్య జట్టుకు కనీస పోటీ ఇవ్వలేకపోతున్న లంక త్రివేండ్రంలోనూ చతికిలపడింది. రేణుకా సింగ్(4-21)తో నిప్పులు చెరగగా.. స్వల్ప ఛేదనలో షఫాలీ ఉప్పెనలా విరుచుకుపడింది. అంతే.. 13.2 ఓవర్లలోనే విక్టరీ కొట్టిన భారత్.. మరో రెండు మ్యాచ్‌లుండగానే సిరీస్ పట్టేసింది.

