తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పేగులు మెడలో వేసుకోవడం, గుడ్లు పీకి గోటీలాడటం వంటి మాటలు ఒక ముఖ్యమంత్రికి తగునా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కుర్చీకి ఉన్న గౌరవాన్ని బట్టి సంయమనం పాటిస్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ సాధించిన నాయకుడు, తన తండ్రి అయిన కేసీఆర్ను తిడితే ఒక కొడుకుగా ఆవేశం రావడం సహజమని, రేవంత్ తీరు చూస్తే ఎడమ కాలి చెప్పుతో కొట్టాలనిపిస్తుందని, కానీ ప్రజాస్వామ్యంపై గౌరవంతో ఆగుతున్నామని మండిపడ్డారు.

