loader

అవార్డులనేవి చెత్త విషయం…నాకొస్తే చెత్తబుట్టలో పడేస్తా: విశాల్ కాంట్రవర్సీ

విశాల్ తన పోడ్‌కాస్ట్ లో అవార్డుల గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. “అవార్డులు కేవలం కమీటీ సభ్యుల నిర్ణయంపై ఆధారపడి ఉంటాయి. 8 కోట్ల మంది లేదా 80 కోట్ల మంది ఇష్టపడే సినిమాకి అవార్డు ఇవ్వాల వద్దా అనేది కేవలం 8మంది సభ్యులు నిర్ణయించడం సరైన విధానం కాదు. ఇది నేషనల్ అవార్డులకు సైతం వర్తిస్తుంది. నావరకు నేను అవార్డుల్ని నమ్మను. ఎవరైనా నాకు అవార్డు ఇస్తే దాన్ని చెత్తబుట్టలో పడేస్తాను’ అని చెప్పుకొచ్చారు.

గురుకుల పార్ట్‌టైమ్‌ ఉపాధ్యాయులకు హైకోర్టు స్వల్ప ఊరట

ఆంధ్రప్రదేశ్‌లోని బాలయోగి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు మరియు కళాశాలల్లో పనిచేస్తున్న పార్ట్‌టైమ్‌ ఉపాధ్యాయులకు హైకోర్టు తాత్కాలికంగా ఉపశమనం కల్పించింది. వీరిని విధులనుంచి తొలగించరాదని, అలాగే తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఉద్యోగాల్లో ఎటువంటి అంతరాయం కలిగించవద్దని హైకోర్టు ఆదేశించింది. సాంఘిక సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి, గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి, వివిధ జిల్లాల కోఆర్డినేటర్లు మరియు ప్రిన్సిపాళ్లకు నోటీసులు జారీ చేశారు.

సిడ్నీలో నారా లోకేష్‌కు ఘన స్వాగతం

ఆస్ట్రేలియాలో మంత్రి లోకేష్ కు ఘన స్వాగతం లభించింది. సిడ్నీలో విమానాశ్రయంలో ప్రవాసాంధ్రులు లోకేష్ కు స్వాగతం పలికారు. స్వాగతిస్తూ సిడ్నీ నగరంలో టవర్ ఫ్లెక్సీలు వెలిశాయి. ఆస్ట్రేలియా టీడీపీ విభాగం నాయకులు మంత్రి లోకేష్ కు సాదరంగా ఆహ్వానం పలికారు. అందరినీ అప్యాయంగా పలకరించి, అందరితో ఫోటోలు దిగారు మంత్రి నారా లోకేష్. ఈరోజు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ ప్రాంగణంలో తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొననున్న మంత్రి లోకేష్

డ్రగ్స్‌ మోసుకెళ్తున్న సబ్‌మెరైన్‌ను సముద్రంలోనే పేల్చేసిన అమెరికా!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. భారీ డ్రగ్స్ నిల్వలతో.. అమెరికా వైపు వస్తున్న సబ్‌మెరైన్ (జలంతర్గామి)ను కరేబియన్ సముద్రంలో ముంచేశామని తెలిపారు. ఒకవేళ ఆ సబ్‌మెరైన్ అమెరికాకు చేరి ఉంటే.. దాదాపు 25, 000 మంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోయేవారని అన్నారు. అమెరికా భద్రతా దళాలు చేపట్టిన ఈ ఆపరేషన్‌లో ఇద్దరు మాదకద్రవ్యాల అక్రమ సరఫరాదారులు మృతి చెందినట్లు తెలిపారు. మరో ఇద్దరిని వారి స్వదేశాలైన ఈక్వెడార్, కొలంబియాకు తిరిగి పంపుతున్నట్లు ట్రంప్ […]

భారత్, ఆస్ట్రేలియా తొలి వన్డేకు వర్షం అంతరాయం..

ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య పెర్త్‌లో జరుగుతున్న మొదటి వన్డేకు వర్షం అంతరాయం కలిగిస్తోంది.  భారత్ ఇన్నింగ్స్ మధ్యలో వర్షంకురవడంతో కొంతసేపు మ్యాచ్ నిలిపివేశారు.మరో 3 ఓవర్లు ఆట కొనసాగిన వెంటనే మరోసారి వరుణుడు ఆటంకం కలిగించాడు.రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ తక్కువ స్కోరుకే అవుటయ్యారు.మొదట 8.5 ఓవర్లలో భారత్ 25/3 స్కోరు వద్ద,11.5 ఓవర్లో 37/3 వద్ద మరోసారి మ్యాచ్ నిలిపివేశారు.ఆట మధ్యాహ్నం దాదాపు ఒంటి గంటకు మొదలయ్యే అవకాశం ఉంది.

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం..! భారీ వర్షాలు

బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఇది మంగళవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమమధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 22వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది.

అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుల్లో ఏసీబీ దాడులు.. అర్ధరాత్రి నుంచి

రాష్ట్ర సరిహద్దుల్లోని రవాణా శాఖ చెక్‌పోస్టులపై ఏసీబీ ఏకకాలంలో దాడులు నిర్వహించింది. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లోని 6 చెక్‌పోస్టుల్లో అర్ధరాత్రి నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని క్రిష్ణా చెక్‌పోస్ట్‌, సంగారెడ్డి జిల్లా చిరాగ్‌పల్లి, కామారెడ్డి జిల్లాలోని సలాబత్‌పూర్‌,చెక్‌పోస్టుల్లో ఏసీబీ అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఈ సందర్భంగా చెక్‌పోస్టుల్లో నగదును స్వాధీనం చేసుకున్నారు. వాహనాల నుంచి ప్రైవేట్‌ సిబ్బంది అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ దాడులు చేసింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON