loader

మెట్రోలో ట్రాన్స్‌జెండర్లకు సెక్యూరిటీగా విధులు

ట్రాన్స్ జెండర్ల ఉపాధి విషయంలో శ్రధ్ద కనబరుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ట్రాఫిక్ అసిస్టెంట్స్‌గా ట్రాన్స్‌జెండర్లను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు హైదరాబాద్ మెట్రో రైళ్లలో సెక్యూరిటీ గార్డులుగా నియమించింది. సెక్యూరిటీ గార్డు నియామకాల కోసం దాదాపు 300- నుండి 400 మంది దరఖాస్తు చేసుకోగా, నైపుణ్యం కలిగిన వారిని ఎంపిక చేశామని తెలిపారు. ట్రాన్స్‌జెండర్ల భవిష్యత్తుకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ భరోసా ఇచ్చారు.

శ్రీ‌శైలంలో వైభ‌వంగా స్వ‌ర్ణ ర‌థోత్స‌వం..

ఆరుద్ర న‌క్ష‌త్రం సంద‌ర్భంగా శ్రీ‌శైలం భ్ర‌మ‌రాంబ మ‌ల్లికార్జున ఆల‌యంలో స్వ‌ర్ణ ర‌థోత్స‌వం వైభ‌వంగా నిర్వ‌హించారు. మంగ‌ళ‌వారం వేకువ జామున స్వామివారికి మహాన్యాసపూర్వకః ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేషపూజలు చేశారు. అనంతరం స్వర్ణరథోత్సవం నిర్వ‌హించారు. ప్ర‌జ‌లంతా సుఖ‌సంతోషాల‌తో ఉండాలంటూ ఆల‌య అర్చ‌కులు లోకకల్యాణాని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. త‌ర్వాత ర‌థంపై ప్ర‌తిష్టించి.. శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజలు చేశారు.

ఐస్‌క్రీమ్‌ పేరును మార్చిన ఉత్తర కొరియా అధ్యక్షుడు

ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా గుర్తుపట్టే పేరు ‘ఐస్‌క్రీమ్‌’ కానీ, ఉత్తరకొరియా నియంతకు ఈ పేరు నచ్చలేదు. దీనివల్ల విదేశీ ప్రభావం తమ ప్రజలపై పడుతుందని కిమ్ అనుమానించారు. ఇక, వెంటనే తమ భాషలో ‘ఎసుకిమో’గా పేరు మార్చేశారు. కాకుంటే ‘ఇయోరియెంబోసెంగి (ఐసు మిఠాయి)’గా పిలవాలని ఆయన మినహాయింపు ఇచ్చినట్టు డెయిలీ ఎన్‌కే పత్రిక వెల్లడించింది. పొరుగున ఉన్న దక్షిణ కొరియా, అమెరికా సహా పశ్చిమ దేశాల పదాలు వినియోగాన్ని పూర్తిగా తొలగించడమే దీని లక్ష్యంగా పేర్కొంది.

మెట్రో రైల్ ఎండీ బాధ్యతల నుంచి ప్రభుత్వ సలహాదారుగా ఎన్వీఎస్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం మెట్రోరైల్ ఎండీగా ఉన్న ఎన్వీఎస్ రెడ్డిని బదిలీ చేసింది. ఆయన స్థానంలో సర్ఫరాజ్ అహ్మద్ ను నియమించింది. ఎన్వీఎస్ రెడ్డి ఇప్పటికే రిటైర్ అయినందున ఆయనను సలహాదారుగా నియమించారు. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ గా నల్లమోతు వేణు గోపాల్ రెడ్డి 2007 నుంచి కొనసాగుతున్నారు. ఆ పదవిని ఏర్పాటు చేసినప్పటి నుండి ఆయనే ఉన్నారు. నిర్వహిస్తున్నారు. 1983 బ్యాచ్ సివిల్ సర్వీసెస్ అధికారి అయిన ఆయన, మొత్తం 18 సంవత్సరాలకు […]

బతుకమ్మ షార్ట్ ఫిల్మ్ పోటీలు..

తెలంగాణ ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ బతుక‌మ్మ యంగ్ ఫిల్మ్ మేక‌ర్స్ ఛాలెంజ్ పేరిట పోటీలు నిర్వ‌హించ‌నుంది. ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆధ్వ‌ర్యంలోని ప్ర‌జా ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న అభివృద్ది, సంక్షేమం తెలంగాణ చ‌రిత్ర‌, సంస్కృతి, పండుగ‌లు, క‌ళారూపాల‌పై షార్ట్ ఫిలిమ్స్‌, పాట‌ల పోటీలు ఉంటాయి. షార్ట్ ఫిలిమ్స్ నిడివి 3 నిమిషాల‌కు, పాట‌ల వ్య‌వ‌ధి 5 నిమిషాల‌కు మించి ఉండ‌కూడ‌దు. ఎంట్రీల‌ను youngfilmmakerschallenge@gmail.com, వాట్సాప్ నెంబర్ – 8125834009 (WhatsApp Only)కు పంపాలి. ఎంట్రీల‌ను పంపించేందుకు తుది […]

కొత్త సంవత్సరానికి క్వాంటమ్ వ్యాలీ సిద్ధం..

క్వాంటమ్ కంప్యూటర్ అమరావతిలో రాబోతోంది. దీనికోసం ఇప్పటికే అమరావతిలో ఇప్పటికే 50 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించారు. సిలికాన్ వ్యాలీ తరహాలో ఈ క్వాంటమ్‌ వ్యాలీని అభివృద్ధి చేస్తారు.IBM, TCS, IIT Madras, L&T వంటి సంస్థలు ఈ ప్రాజెక్టులో భాగం కాబోతున్నాయి. అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో క్వాంటమ్ వ్యాలీ డిజైన్లను విడుదల చేశారు చంద్రబాబు. IIT మద్రాస్ రూపొందించిన ఈ డిజైన్లకు ఆమోదం తెలిపారు. అయితే ప్రాథమికంగా కార్యకలాపాలు ప్రారంభించడానికి ఓ భవనాన్ని కేవలం […]

డిగ్రీ అర్హతతో హైదరాబాద్‌ ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు..

హైదరాబాద్‌లోని అటామిక్‌ ఎనర్జి విభాగానికి చెందిన ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ECIL).. ఒప్పంద ప్రాతిపదికన టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో సెప్టెంబర్‌ 22, 2025వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ ప్రకటన కింద మొత్తం 160 టెక్నికల్‌ ఆఫీసర్‌-సి పోస్టులను భర్తీ చేయనున్నారు. 60 శాతం మార్కులతో సంబంధిత విభాగాల్లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత కలిగి […]

30 పైసలకు పడిపోయిన కిలో ఉల్లి ధర.. రైతు ఆత్మహత్య

నిన్నటి వరకు క్వింటాలుకు వేలల్లో ధర పలికిన ఉల్లి, ఇప్పుడు కిలోకు 30 పైసలకు పడిపోయింది. ఈ స్థాయి పతనం కర్నూలు మార్కెట్ చరిత్రలో ఎన్నడూ చూడలేదని అన్నదాతలు వాపోతున్నారు. వెల్దుర్తి మండలం కోసనేపల్లిలో విషాదం చోటు చేసుకుంది. పురుగుల మందు తాగి ఉల్లి రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రూ.2 లక్షలతో ఉల్లి సాగు చేసిన రైతు రామచంద్రుడు.. ఉల్లి ధర దారుణంగా పడిపోవడంతో మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. అప్పులు తీరక ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, […]

టీటీడీ వ్యవహారంలో భూమన అరెస్టుకు రంగం సిద్ధం!

టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని అక్రమ కేసులతో అరెస్టు చేయాలని చూస్తున్నారని తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త భూమన అభినయ్ వెల్లడించారు. కొంతకాలంగా టీటీడీ పాల‌క మండ‌లికి, కూట‌మి ప్రభుత్వానికి కంట‌గింపుగా మారిన భూమ‌న క‌రుణాకర్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయ‌డానికి రంగం సిద్ధమైన‌ట్టు విశ్వస‌నీయ వ‌ర్గాల ద్వారా తెలిసిందని అన్నారు. భూమన అక్రమ అరెస్టుతో వైసీపీ నోళ్లు మూయించలేరని స్పష్టం చేశారు.

హైద‌రాబాద్‌లో న‌గ్నంగా యువ‌తి మృత‌దేహం ల‌భ్యం..

రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో మ‌రో దారుణం వెలుగు చూసింది. రాజేంద్ర‌న‌గ‌ర్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని కిస్మ‌త్‌పురా బ్రిడ్జి కింద ఓ యువ‌తి మృత‌దేహం ల‌భ్య‌మైంది. ఆ డెడ్‌బాడీ న‌గ్నంగా ఉండ‌డంతో.. ఆమెపై అత్యాచారం చేసి హ‌త్య చేసి ఉండొచ్చ‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. 25 నుంచి 30 ఏండ్ల వ‌య‌సున్న యువ‌తిని మూడు రోజుల క్రిత‌మే హ‌త్య చేసిన‌ట్లు పోలీసులు భావిస్తున్నారు. క్లూస్‌ టీమ్ సహాయంతో, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON