క్వాంటమ్ కంప్యూటర్ అమరావతిలో రాబోతోంది. దీనికోసం ఇప్పటికే అమరావతిలో ఇప్పటికే 50 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించారు. సిలికాన్ వ్యాలీ తరహాలో ఈ క్వాంటమ్ వ్యాలీని అభివృద్ధి చేస్తారు.IBM, TCS, IIT Madras, L&T వంటి సంస్థలు ఈ ప్రాజెక్టులో భాగం కాబోతున్నాయి. అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో క్వాంటమ్ వ్యాలీ డిజైన్లను విడుదల చేశారు చంద్రబాబు. IIT మద్రాస్ రూపొందించిన ఈ డిజైన్లకు ఆమోదం తెలిపారు. అయితే ప్రాథమికంగా కార్యకలాపాలు ప్రారంభించడానికి ఓ భవనాన్ని కేవలం 120 రోజుల్లో సిద్ధం చేయించనున్నట్లు సమాచారం.

