loader

భారత నౌకాదళంలో తొలి మహిళా ఫైటర్.. మరో నవశకం ఆరంభం!

ఇండియన్‌ నేవీలో శిక్షణ పొందిన మొదటి మహిళా ఫైటర్ పైలట్‌గా సబ్ -లెఫ్టినెంట్ ఆస్తా పూనియా చరిత్ర సృష్టించారు. ఆమె దేశ నావికాదళంలో తొలి మహిళా ఫైటర్ పైలట్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. నౌకాదళంలో మహిళా ఫైటర్ల చేరికతో నూతన శకం ఆరంభమైందని అసిస్టెంట్‌ చీఫ్‌ ఆఫ్‌ నేవల్‌ స్టాఫ్‌ రియర్‌ అడ్మిరల్‌ జనక్‌ బెల్వీ అన్నారు.  ఆస్తా పూనియా దేశంలోనే తొలి మహిళా ఫైటర్‌ పైలట్‌గా నిలిచినందుకు ప్రశంసించారు. ఆమె భవిష్యత్తులో సముద్రంలో విమాన వాహక నౌకల […]

ట్రంప్ సుంకాలకు మోడీ తలొగ్గుతారు..రాసి పెట్టుకోండి : రాహుల్

మూడు నెలల క్రితం భారత్‌పై 26 శాతం సుంకాలు విధిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. 90 రోజుల విరామం తర్వాత అది అమలు లోకి రాకుండా ఉండేందుకు వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి భారత్ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గుండెలు బాదుకోవడం తప్ప చేసేదేమీ ఉండదని రాహుల్ పేర్కొన్నారు. , తన మాటలు నమ్మకపోతే […]

చరిత్ర సృష్టించిన శుభమన్ గిల్..

క్రికెట్ అభిమానులంతా ఆశ్చర్యపోయే విధంగా ఇంగ్లాండ్‌తో ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో గిల్, రెండు ఇన్నింగ్స్‌లు కలిపి ఏకంగా 346 పరుగులు చేసి, భారత్ తరఫున ఒక టెస్ట్ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. గతంలో దిగ్గజ ఆటగాళ్లు సునీల్ గవాస్కర్, వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్‌లు నెలకొల్పిన రికార్డులను కూడా దాటేశాయి. అంతేకాదు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ చేసిన 293 పరుగుల రికార్డును కూడా గిల్ బద్దలు […]

తెలంగాణలో ఓటరు జాబితా నుంచి మాజీ ఎమ్మెల్యే పేరు తొలగింపు

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వేములవాడ ఎమ్మెల్యేగా నాలుగు సార్లు గెలిచిన చెన్నమనేని రమేష్ తన ఓటు హక్కును కోల్పోయారు. ఇటీవల హైకోర్టు ఇచ్చిన కీలక తీర్పు ఆధారంగా ఆయన భారత పౌరుడు కాదని తేలింది. దీంతో ఎన్నికల అధికారులు అతని పేరును వేములవాడ ఓటరు జాబితా నుంచి తొలగించారు. ఈ అంశంపై అధికారులు మరింత స్పష్టత ఇచ్చారు. చెన్నమనేని నివాసానికి నోటీసులు అంటించారు.

జపాన్‌లో బద్దలైన షిన్మోడాకే అగ్నిపర్వతం- మాంగా కార్టూన్‌ జోస్యం

జపాన్‌లోని షిన్మోడాకే అగ్నిపర్వతం జూలై 3న బద్దలయ్యింది. అగ్నిపర్వతం నుంచి దట్టమైన పొగ, బూడిద ఎగసిపడుతున్నాయి. 3,000 మీటర్ల ఎత్తు వరకూ పొగ వ్యాపించడంతో స్థానిక అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. రోయో టాట్సూకీ రూపొందించిన మాంగా కార్టూన్‌లో పేర్కొన్న జోస్యం నిజం కాబోతోందని టెన్షన్ పడిపోతున్నారు. 021లో రెండో ఎడిషన్ మాంగా కార్టూన్‌లను విడుదల చేసిన ఆమె 2025 జులైలో మరో ప్రకృతి విపత్తు గురించి హెచ్చరించారు. సునామీ ముంచెత్తుతుందని హెచ్చరించారు.

అమరావతిలో ఎంఎస్కే క్రికెట్ , గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలు

పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడెమీ, ఎంఎస్కే ప్రసాద్ క్రికెట్ అకాడెమీలను అమరావతి ఏర్పాటులో చేయడానికి భూములు కేటాఇస్తూ సీఆర్డీఏ నిర్ణయం తీసుకుంది. ఉండవల్లిలోని నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ముగిసిన 50వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. మొత్తం ఏడు అంశాలకు సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఆమోదం లభించింది. అమరావతి లో జరుగుతున్న నిర్మాణ పనులకు ఇసుక డ్రెడ్జింగ్ కోసం సీఆర్డీఏకు అనుమతి ఇచ్చారు.

హైదరాబాద్ వీధుల్లో గస్తీ కోసం శివంగులు…

శాంతిభద్రతల పరంగా హైదరాబాద్ చాలా సెన్సిటివ్ ప్రాంతం. ప్రతి నిమిషం అలర్ట్‌గా ఉండడం చాలా అవసరం. హైదరాబాద్ పోలీసులు ఫస్ట్ టైమ్ స్విఫ్ట్ ఉమెన్ యాక్షన్ టీమ్‌ను ప్రారంభించారు. ఈ బృందంలో 35 మంది మహిళా సిబ్బంది ఉన్నారు. వీరికి నిరాయుధ పోరాటంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ స్వాట్ బృందాన్ని ప్రధానంగా ధర్నాలు, ర్యాలీలు, ఇతర బహిరంగ సభలలో మహిళా నిరసనకారులను సమర్థవంతంగా అడ్డుకునేందుకు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగరంలో జరిగే ముఖ్యమైన కార్యక్రమాలు, పండుగల […]

ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్…

అమరావతి రాజధాని నిర్మాణానికి మరింత ఊతం ఇచ్చేలా కీలక ప్రకటన చేసింది. రెవెన్యూలోటుతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రానికి ఉపశమనం కలిగించేలా మంచి శుభవార్త అందించింది. అమరావతి గ్రీన్‌ఫీల్డ్ రాజధాని నిర్మాణం కోసం వరల్డ్ బ్యాంక్, ఏడీబీ లాంటి సంస్థల ద్వారా తీసుకున్న రూ.15,000 కోట్ల రుణాన్ని కేంద్ర ప్రభుత్వం గ్రాంటుగా మార్చాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ రుణం ‘ఎక్స్టర్‌నల్ ఎయిడెడ్ ప్రాజెక్టుల’ కింద రాష్ట్ర అప్పుగా నమోదు కాకపోవడం వల్ల ఇది తుది నిర్ణయంగా తెలుస్తోంది.

వ్యాపారం చేసుకునే మహిళలను ప్రోత్సహిస్తున్నాం: భట్టి

తమ ప్రభుత్వం మహిళా సంఘాలకు అండగా ఉంటుందని తెలంగాణా డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తెలిపారు. అవకాశం ఉన్న ప్రతిచోటా మహిళలకు ఆర్థిక భరోసా ఇస్తామని అన్నారు. ప్రజాభవన్ లో ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహించారు. ఆర్టిసికి అద్దె బస్సులు అందించిన మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. వ్యాపారం చేసుకునే మహిళలను ప్రోత్సహిస్తున్నామని, కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని తెలియజేశారు.

20ఏళ్ల తర్వాత ఒకే వేదికపై అన్నదమ్ములు..

మహారాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు నెలకొంటున్నాయి. రెండు దశాబ్దాల తర్వాత అన్నదమ్ములు ఇద్దరూ ఒకే వేదికపై కనిపించారు. .ఉద్ధవ్ థాక్రే, రాజ్ థాక్రే. ఒకొరిని ఒకరు హగ్ చేసుకోవడం అక్కడ ఉన్నవారిని ఆకట్టుకుంది. 2005లో చివరిసారిగా ఒకే వేదికపై కలిసి కనిపించిన ఈ ఇద్దరూ.. మళ్లీ 20 ఏళ్ల తర్వాత కనిపించారు. 1 నుంచి 5వ తరగతి వరకు హిందీని బోధించాలని ఉత్తర్వుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్దవ్, రాజ్ సంయుక్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. ముంబై పట్టణంలోని వర్లీలో […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON