మూడు నెలల క్రితం భారత్‌పై 26 శాతం సుంకాలు విధిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. 90 రోజుల విరామం తర్వాత అది అమలు లోకి రాకుండా ఉండేందుకు వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి భారత్ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గుండెలు బాదుకోవడం తప్ప చేసేదేమీ ఉండదని రాహుల్ పేర్కొన్నారు. , తన మాటలు నమ్మకపోతే రాసి పెట్టుకోవాలని వ్యాఖ్యానించారు.

