loader

టీటీడీ ఎస్వీ ప్రాణదానం ట్రస్టుకు భారీగా విరాళాలు.. రూ.2 కోట్ల విరాళాలు

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఆధ్వర్యంలో నడిచే ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు దాతలు రూ.2 కోట్లు విరాళంగా అందజేశారు. సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద రూ.1.50 కోట్ల విరాళాలు అందజేసింది. చెన్నైకి చెందిన పొన్‌ప్యూర్‌ కెమికల్‌ ఇండియా సంస్థ కూడా టీటీడీ ప్రాణదానం ట్రస్ట్‌కు రూ.50 లక్షలు విరాళంగా అందించింది. తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఆధ్వర్యంలో నడిచే ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ ఒక ప్రతిష్ఠాత్మక సేవా కార్యక్రమం, దీని లక్ష్యం […]

జపాన్ టెక్నిక్ ఫాలో కానున్న ఏపీ.. అమరావతి కోసం మోదీ సలహా..

ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీలో.. అమరావతి అంశం ప్రస్తావనకు వచ్చింది. అమరావతి పునఃప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని చంద్రబాబు ఆహ్వానించారు, ఈ సందర్భంగా అమరావతి నిర్మాణంలో జపాన్‌లోని మియావాకి మెథడ్ అనుసరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రధాని మోదీ సలహా ఇచ్చారు. మియావాకి విధానంలో మొక్కలను దగ్గరగా నాటుతారు. నిలువుగా పెరిగేలా చదరపు మీటరుకు రెండు నుంచి నాలుగు మొక్కలను నాటుతారు. దీంతో అడవులు 30 రెట్లు దట్టంగా, సాధారణ అడవులకంటే 10 రెట్లు వేగంగా పెరుగుతాయి.

తెలంగాణ కొత్త సీఎస్‌గా కే రామకృష్ణారావు

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి కే రామకృష్ణారావును నియమించింది. ప్రస్తుత సీఎస్ శాంతి కుమారి ఏప్రిల్ 30 పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రామకృష్ణారావు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సీనియరిటీ జాబితా ప్రకారం.. రామకృష్ణారావుతోపాటు ఆరుగురు అధికారుల పేర్లను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం సమర్థత, అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని 1991 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన రామకృష్ణారావును సీఎస్‌గా నియమించాలని నిర్ణయించింది.

నయవంచక కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్నిరంగాల్లో ఫెయిల్‌ : కేసీఆర్‌

బీఆర్‌ఎస్‌ ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా ఓరుగల్లు గడ్డ ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. సభలో రేవంత్‌ సర్కారు తీరుపై నిప్పులు చెరిగారు. నయకవంచక కాంగ్రెస్‌ ప్రభుత్వం సంక్షేమంలో ఫెయిల్‌. మంచినీళ్లు ఇవ్వడంలో ఫెయిల్‌. సాగుకు నీరివ్వడంలో ఫెయిల్‌. కరెంటు సరఫరాలో ఫెయిల్‌. రైతుబంధు ఇవ్వడంలో ఫెయిల్‌ అన్నిరంగాల్లో ఫెయిల్‌ అయ్యిందని మీ వెంట బీఆర్‌ఎస్‌ ఉంటది.. కేసీఆర్‌ ఉంటడు. వందశాతం మళ్లీ తెలంగాణలో విజయం సాధించాలి.. గులాబీ జెండా ఎగురవేయాలి.. అద్భుతమైన […]

సివిల్స్‌ ఉచిత శిక్షణకు బ్రేక్‌

గిరిజన అభ్యర్థులకు సివిల్స్‌లో ఉచిత శిక్షణ ఇవ్వాలనుకున్న ఐటీడీఏ అధికారుల ఆలోచనలకు ఆదిలోనే అడ్డంకులు ఏర్పడ్డాయి. ఉచిత శిక్షణకు సంబంధించి ఐటీడీఏ అధికారులు టెండర్లు ఆహ్వానించారు.టెండర్ల ప్రక్రియలో పాల్గొనే ఏజెన్సీలకు ఎస్‌టీ అభ్యర్థులకు కనీసం రెండేళ్లు కోచింగ్‌ ఇచ్చిన అనుభవం ఉండాలనే నిబంధన పెట్టారు. టెండర్ల ప్రక్రియలో కేవలం 21వ సెంచరీ అకాడమీ మాత్రమే అర్హత సాధించింది. దీంతో టెండర్ల ప్రక్రియ ఏకపక్షంగా నిర్వహించారని శరత్‌చంద్ర కోచింగ్‌ అకాడమీ హైకోర్టును ఆశ్రయించింది.

ఎపిలో పాకిస్థాన్ నుంచి ఆపరేట్ అవుతున్న లోన్ యాప్ ముఠా అరెస్ట్

ఎపిలో పాకిస్థాన్ నుంచి ఆపరేట్ అవుతున్న లోన్ యాప్ ముఠా అరెస్టు చేశారు. లోన్ యాప్‌ల ద్వారా ఆర్థిక నేరాలకి పాల్పడుతోన్న ముఠా గుట్టును విశాఖ నగర పోలీసులు రట్టు చేశారు. అందుకు సంబంధించి ఇన్వెస్టమెంట్ ఫ్రాడ్ కేసులో ప్రధాన నిందితుడుతో సహా 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే రూ.60 లక్షల విలువైన క్రిఫ్టో కరెన్సీని పోలీసులు సీజ్ చేశారు. ఆదివారం విశాఖపట్నంలో నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి మీడియా సమావేశంలో […]

మహిళను ట్రాప్ చేశారంటూ పీఏపై తీవ్ర ఆరోపణలు.. స్పందించిన టీడీపీ ఎమ్మెల్యే

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి పీఏ వాహిద్ వివాదంలో చిక్కుకున్నారు. పీఏ వాహిద్ మీద తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పీఏ వాహిద్ వ్యవహారంపై రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డితో పాటుగా ఆయన భార్య కడప ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి రెడ్డి స్పందించారు. వాహిద్‌పై తీవ్ర ఆరోపణల నేపథ్యంలో అతణ్ని విధుల నుంచి తొలగిస్తున్నట్లు శ్రీనివాసులు రెడ్డి ప్రకటించారు.  సంపూర్ణంగా విచారించి  చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నట్లు తెలిపారు. ఇదే విషయాన్ని రెడ్డెప్పగారి […]

తమిళనాడు మంత్రులు సెంథిల్ బాలాజీ, పొన్ముడి రాజీనామాలు

ఎం.ఎల్.స్టాలిన్ నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గం నుండి తమిళనాడు మంత్రులు వి.సెంథిల్ బాలాజీ, కె. పొన్ముడి రాజీనామా చేశారని, గవర్నర్ దానిని ఆమోదించారని రాజ్‌భవన్ ఆదివారం తెలిపింది. సెంథిల్ బాలాజీ ఈడి దర్యాప్తును ఎదుర్కొంటున్నారు,‘పదవా లేక స్వేచ్ఛా ఏదో ఒకటి ఎంచుకొండి’ అంటూ సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది. ఒకవేళ మంత్రి పదవి నుంచి దిగిపోకపోతే బెయిల్‌ను కూడా రద్దు చేస్తామని హెచ్చరించింది. ఒక సెక్స్ వర్కర్ విషయంలో పొన్ముడి చేసిన శైవ వైష్ణవ వ్యాఖ్యలపై పెద్ద దుమారమే […]

ప్రధాని మోదీ అమరావతి పర్యటన షెడ్యూల్ ఖరారు,

రాజధాని అమరావతిలో మే 2న పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్వయంగా ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అమరావతి పునర్ నిర్మాణంలో భాగంగా వేల కోట్ల పనులకు మోదీ శ్రీకారం చుట్టనున్నారు. మే 2న ప్రధాని మోదీ 15 నిమిషాలు రోడ్డుషో.. గంట పాటు సభ నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ప్రధాన వేదికపై ప్రధాని మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా మొత్తం 20 మంది కూర్చునేందుకు ప్లాన్ చేశారు. మిగతా […]

హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు భూసేకరణ.. ఎకరాకు రూ. కోటి పరిహారం, కాకపోతే..!

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు (RRR) పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఔటర్ రింగు రోడ్డుపై ట్రాఫిక్ తగ్గించడమే కాకుండా, వాణిజ్యాభివృద్ధికి ఇది కీలకం కానుంది. ఉత్తర భాగంలో 88 శాతం భూసేకరణ పూర్తయింది. రైతులకు ఎకరానికి రూ.50 లక్షలు నుంచి రూ.1 కోటి వరకు పరిహారం చెల్లిస్తున్నారు. ఇప్పటికే 17మంది రైతులకు ఎకరాకు రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు పరిహారం ఖరారు చేసినట్లు చెప్పారు. అయితే అందరికీ ఈ స్థాయిలో […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON