loader

అమెరికా ఉపాధ్యక్షుడి సతీమణి ఉషా చిలుకూరికి కేంద్ర రైల్వే శాఖ అరుదైన గిఫ్ట్ . . .

జేడీ వాన్స్ సతీమణి, తెలుగు మూలాలున్న ప్రవాస భారతీయురాలు ఉషా చిలుకూరికి కేంద్ర రైల్వే శాఖ అరుదైన గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. కృష్ణా జిల్లా ఉయ్యూరు సాయిపురం గ్రామం సమీపంలో ఉషా వాన్స్ కుటుంబ సభ్యుల మూలాలున్నాయి. ఉషా వాన్స్ తల్లి తండ్రులు శ్రీలక్ష్మీ,రాధాకృష్ణలు 1970 దశకంలో వలస వెళ్లారు. ఉషా వాన్స్ మూలాలు ఉన్న కృష్ణా జిల్లా ఉయ్యూరు గ్రామ సమీపంలోని రైల్వే స్టేషన్ మెమోంటోను గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర రైల్వే […]

భవనాన్ని ఖాళీ చేయండి.. శారదాపీఠానికి టీటీడీ నోటీసులు

శారదా పీఠం మఠం భవన నిర్మాణంలో ఆక్రమణలు, అవకతవకలు జరిగినట్లు టీటీడీ అధికారుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తిరుమలలో శారదా పీఠం ఆక్రమణలను తొలగిస్తామని టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు బోర్డు సమావేశంలో పేర్కొన్నారు. నిబంధనలను మఠం ఉల్లంఘించిందని న్యాయస్థానం గుర్తించడంతోపాటు మఠంపై చర్యలు తీసుకునే అధికారం టీటీడీకు ఉందని తీర్పులో పేర్కొంది. ఈ మేరకు 15 రోజుల్లోపు మఠాన్ని ఖాళీ చేసి భవనాన్ని అప్పగించాలని టీటీడీ ఎస్టేట్‌ విభాగం నోటీసు జారీ చేసింది.

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు ఘన స్వాగతం- ఢిల్లీలో భద్రత పెంపు

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్, వారి ముగ్గురు పిల్లలు భారత్‌కు విచ్చేశారు. ఢిల్లీలోని పాలం ఎయిర్ పోర్టులో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఘన స్వాగతం పలికారు.  అమెరికా ఉపాధ్యక్షుని పర్యటన కావడంతో భద్రతా ప్రోటోకాల్ ప్రకారం ఇప్పటికే మాక్ డ్రిల్ చేశాం. సెక్యూరిటీ కట్టుదిట్టం చేశాం. జేడీ వాన్స్ ఫ్యామిలీ భారత సందర్శన సమయంలో ప్రతిదీ సజావుగా సాగేలా చూడటంలో భాగంగా ఢిల్లీలోని అన్ని ప్రాంతాలలో భద్రతను కట్టుదిట్టం చేశాం” […]

ప్రతి ఐదుగురిలో ఒకరికి ‘డీ’ విటమిన్‌ లోపం

దేశంలోని ప్రతి ఐదుగురిలో ఒకరు (49 కోట్ల మంది) ‘డీ’ విటమిన్‌ లోపంతో బాధపడుతున్నట్టు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ ఇంటర్నేషనల్‌ ఎకానమిక్‌ రి సెర్చ్‌ (ఐసీఆర్‌ఐఈఆర్‌) వెల్లడించింది. వారిలో దాదాపు 30% మంది పిల్లలు, యుక్తవయసులు ఉన్నట్టు పేర్కొన్నది. పురుషుల కంటే మహిళల్లో ‘డీ’ విటమిన్‌ లోపం ఎక్కువగా ఉన్నట్టు స్పష్టంచేసింది. దేశంలో ఏడాది పొడవునా తగినంత సూర్యరశ్మి ఉన్నప్పటికీ కాలుష్యం పెరుగుదల, పట్టణీకరణ, ఆధునిక జీవనశైలి ‘డీ’ విటమిన్‌ లోపానికి దారితీస్తున్నట్టు ఐసీఆర్‌ఐఈఆర్‌ […]

మహా కుంభమేళాను రాజకీయ కుంభమేళాగా మార్చిన బీజేపీ: అఖిలేశ్‌

ఉత్తరప్రదేశ్‌లో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలోని బీజేపీ సర్కార్‌పై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను ప్రధానిగా ప్రమోట్‌ చేసేందుకు రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన మహా కుంభమేళాను రాజకీయ కుంభమేళాగా బీజేపీ వాడుకుందని విమర్శించారు.

కబ్జా నుంచి కాపాడేందుకు.. రూ.1200 కోట్ల ఖాళీ ప్రభుత్వ స్థలానికి ఫెన్సింగ్‌

కబ్జాదారుల నుంచి ప్రభుత్వ స్థలాన్ని కాపాడేందుకు చర్యలు చేపట్టారు రెవెన్యూ అధికారులు. బంజారాహిల్స్‌ రోడ్‌ నం. 12లోని ఏసీబీ కార్యాలయం ముందు ఖాళీ స్థలంలో ప్రభుత్వానికి, ప్రైవేటు వ్యక్తులకు మధ్య వివాదాలు ఉండడాన్ని అదును చూసుకుని స్థలాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అప్రమత్తమైన షేక్‌పేట మండల రెవెన్యూ అధికారులు స్థలాన్ని కాపాడేందుకు చర్యలు ప్రారంభించారు. రెవెన్యూ రికార్డులను, కోర్టు కేసులను పరిశీలించగా సుమారు 12 ఎకరాల ప్రభుత్వ స్థలంపై ఎలాంటి వివాదాలు లేవని, కోర్టుల్లో కేసులు కూడా […]

రాచరికం మళ్లీ రావాలి.. నేపాల్‌లో భారీ నిరసనలు..

నేపాల్‌లో మళ్లీ రాచరిక పాలన రావాలని వందలాది మంది కాఠ్మాండూలో ఆదివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. పార్లమెంటు, ప్రధాన మంత్రి నివాసం హై సెక్యూరిటీ జోన్‌ సమీపంలో రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీకి చెందిన దాదాపు 1,500 మంది ధర్నా చేశారు. గణతంత్ర విధానం నశించాలి’, ‘రాచరికం మళ్లీ రావాలి’, ‘నేపాల్‌ను హిందూ దేశంగా ప్రకటించాలి’ అంటూ నినాదాలు చేశారు. ఆర్‌పీపీ చైర్మన్‌ రాజేంద్ర లింగ్డెన్‌, సీనియర్‌ నేతలు పశుపతి షంషేర్‌ రాణా, బహదూర్‌ ప్రధాన్‌  ఈ కార్యక్రమానికి […]

హైదరాబాద్‌లో ఎకో టౌన్ ఏర్పాటు, జపాన్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం

జపాన్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం పర్యావరణహిత కిటాక్యూషు నగరాన్ని ఆదివారం సందర్శించింది. హైదరాబాద్‌లో ఎకో టౌన్ ఏర్పాటుకు జపాన్‌కు చెందిన ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. కిటాక్యూషు మాదిరిగా హైదరాబాద్‌ను శుభ్రమైన, సుస్థిర నగరంగా తీర్చిదిద్దడంలో భాగంగా ఈ ఒప్పందాలు జరిగాయి. ఈఎక్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, నిప్పాన్ స్టీల్ ఇంజినీరింగ్, పీ9 ఎల్ఎల్సీ, న్యూ కెమికల్ ట్రేడింగ్, అమితా హోల్డింగ్స్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది.

తిరుమలలో వేసవి రద్దీ.. శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక విజ్ఞప్తి..

తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక విజ్ఞప్తి చేసింది. శ్రీవారి దర్శనం కోసం దర్శన టికెట్లు, టోకెన్లతో వచ్చే భక్తులు నిర్దేశిత సమయంలోనే రావాలని కోరింది. శ్రీవారి దర్శనం టోకెన్లు, టికెట్లు క‌లిగిన భ‌క్తులు నిర్దేశిత స‌మ‌యంలోనే క్యూలైన్లలోకి ప్రవేశించాలని టీటీడీ ఏఈవో వెంక‌య్య చౌద‌రి విజ్ఞప్తి చేశారు. సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు తమకు కేటాయించిన సమయానికే దర్శనం కోసం క్యూలైన్లలోకి రావాలని కోరారు. వరుస […]

రక్తపు మడుగులో మాజీ డీజీపీ ఓం ప్రకాశ్‌.. భార్యపైనే అనుమానం..!

కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ బెంగళూరులోని తన నివాసంలో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. అతని భార్యే అతన్ని హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఓం ప్రకాష్  2015లో కర్ణాటక రాష్ట్రానికి 38వ డీజీ అయ్యారు. కుటుంబ వివాదం నేపథ్యంలో అతని భార్య పల్లవి, కుమార్తెను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.  తన ప్రాణాలకు ముప్పు ఉందని ప్రకాష్ కొంతమంది సన్నిహితుల ముందు ఆందోళన వ్యక్తం […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON