loader

మనోజ్‌ను చూసి..! ఎమోషనల్ అయిన మంచు లక్ష్మి..!

మంచు లక్ష్మి హైదరాబాద్ లో టీచ్ ఫర్ ఛేంజ్ సేవా కార్యక్రమం.. నిర్వహించింది. దీనిలో సెలబ్రీటీలతో ఫ్యాషన్ షోలను నిర్వహించారు. ఈ కార్యక్రమంతో వచ్చిన ఫండ్ ను మంచు లక్ష్మి వివిధ సేవా కార్యక్రమాల్లో ఉపయోగించనున్నారు. అయితే.. తాజాగా.. మంచు మనోజ్, మౌనిక లు కూడా ఈ ప్రొగ్రామ్ కు వచ్చారు. అప్పుడు.. మంచు లక్ష్మి వీరిని ఒక్కసారిగా చూసి ఎమోషనల్ అయ్యింది. స్టేజీ మీదనే కూర్చుండిపోయి ఏడ్చేసింది. దీంతో మంచు మనోజ్ దంపతులు సైతం తమ […]

ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన మరో తెలుగు కుర్రాడు..

గుంటూరుకు చెందిన షేక్ రషీద్ చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఐపీఎల్ ఎంట్రీ అద‌రిపోయింది. తన తొలి ఐపీఎల్ మ్యాచ్ లో రషీద్ దూకుడుగా ఆడుతూ 19 బంతుల్లో 6 బౌండరీలతో 27 పరుగులు చేశాడు. రషీద్ కొట్టిన షాట్స్ చూసిన కామెంటర్స్ అతను విరాట్ కోహ్లీ షేడ్స్ ను కలిగి ఉన్నాడని కామెంట్స్ చేశాడు.భార‌త్ కు మ‌రో భ‌విష్య‌త్తు స్టార్ దొరికాడు.. ఎంఎస్ ధోని టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) , తరఫున అరంగేట్రం […]

థాంక్యూ ట్రంప్ .. హమ్మయ్యా ఆంధ్ర రొయ్యకు ఊపిరొచ్చింది..

ట్రంప్ దెబ్బకు అల్లాడిపోయిన రొయ్యల రైతులకు మళ్లీ మంచిరోజులు వచ్చాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెంచిన సుంకాల అమలును వాయిదా వేయడంతో ఆంధ్ర రొయ్యల పరిశ్రమకు మళ్లీ ఊపిరి వచ్చింది. మొన్నటి వరకు  లిచిపోయిన రొయ్యల కంటైనర్లు మళ్లీ అమెరికాకు బయలుదేరడానికి సిద్ధమవుతున్నాయి.. దీంతో గోదాముల్లో నిల్వలు తగ్గుతున్నాయి. సుంకాల అమలుకు 90 రోజుల గడువు ఇవ్వడంతో వాటిని అమెరికాకు ఎగుమతి చేయడానికి ద్ధమయ్యారు వ్యాపారులు. ఏపీ ప్రభుత్వం రొయ్యల ధరలపై ఏర్పాటు చేసిన ఆక్వా సలహా […]

పవన్ కళ్యాణ్‌ను కలిసిన అల్లు అర్జున్.. మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న బన్నీ

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను అల్లు అర్జున్ కలిశారు. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఇటీవలే అగ్నిప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో పవన్‌తో పాటు కుటుంబ సభ్యులను కలిసిన అల్లు అర్జున్‌.. మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. సోమవారం నాడు హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ ను అల్లు అర్జున్ కలిశారు.

ఆ భూములు మావే!

కంచ గచ్చిబౌలి సర్వే నంబర్‌ 25లోని 400 ఎకరాల భూమి తమదేనని తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున చీఫ్‌ సెక్రటరీ శాంతికుమారి ఆన్‌లైన్‌ ద్వారా కోర్టుకు ఈ అఫిడవిట్‌ దాఖలు చేశారు. కేసు తదుపరి విచారణ ఈ నెల 16న జరగనుండగా.. సీఎస్‌ శాంతికుమారి, ఆమె ఆధికారుల బృందం రెండు రోజులు ఢిల్లీలోనే మకాం వేశా రు. సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులతో సంప్రదింపుల జరిపిన అనంతరం సర్వోన్నత […]

చట్టాల సవరణలతో హక్కుల హరింపు

చట్టాల సవరణలతో రాజ్యాంగంలో కల్పించిన హక్కులను బీజేపీ ప్రభుత్వం హరిస్తున్నదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ 134వ జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్‌ వద్ద అంబేద్కర్‌ విగ్రహానికి చాడవెంకట్‌రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనుసృ్మతి తిరోగమన భావజాలాన్ని అంబేద్కర్‌ వ్యతిరేకించారని తెలిపారు. సామాజిక సంసర్త, న్యాయవేత్త, రచయిత, బహుభాషావేత్త, ఆలోచనాపరుడు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ అని కొనియాడారు

సామాన్యుడికి పాదరక్షలు తొడిగిన ప్రధాని మోడీ

మోడీ ప్రధాని అయ్యేవరకు , అలాగే స్వయంగా మోడీని కలుసుకునేంతవరకు పాదరక్షలు తొడగనని 2009లో ప్రతిజ్ఞ చేసిన హర్యానా లోని కైతాల్ నివాసి అయిన రామ్‌పాల్ కశ్యప్‌కు ప్రధాని మోడీ పాదరక్షలు తొడిగించారు. సోమవారం నాడు ప్రధాని మోడీ హర్యానా పర్యటన సమయంలో ఈ సంఘటన జరిగింది. తన కోసం 14 ఏళ్లుగా పాదరక్షలు లేకుండా నడుస్తున్న వీరాభిమాని కశ్యప్ శపథాన్ని మోడీ నెరవేర్చారు.

ఇకపై సహించేది లేదు.. కలెక్టర్లకు సీఎం రేవంత్ మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్

తెలంగాణలోని కలెక్టర్ల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. మరోసారి కలెక్టర్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. రెగ్యులర్ వర్క్ షీట్లు పంపని, క్షేత్రస్థాయి పర్యటనలు చేయని కలెక్టర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భూ భారతి చట్టం, ఇందిరమ్మ ఇళ్ల పథకం, వేసవి తాగునీటి సమస్యలపై కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.

కారులో బాంబు పెడతాం.. సల్మాన్ ఖాన్‌ను లేపేస్తాం..

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. వాట్సాప్ ద్వారా బాంబ్ బెదిరింపు కాల్ వచ్చింది. కారులో బాంబు పెట్టి పేల్చాస్తామని ఆగంతకుడు బెదిరించాడు. దీనిపై ముంబైలోని వర్లిలోని ట్రాన్స్ పోర్ట్ విభాగానికి మెసేజ్ వచ్చింది. దీంతో వర్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. సల్మాన్ ఖాన్‌కు సెక్యూరిటీని మరింత టైట్ చేశారు అధికారులు. సల్మాన్ ఖాన్‌కు ప్రాణాలకు ఎలాంటి హాని కలగకుండా భద్రతను మరింత కట్టు దిట్టం చేశారు పోలీసులు.

ముదురుతోన్న భాషా వివాదం.. ఎయిర్‌పోర్టులో హిందీ బోర్డులు తొలగింపు

బెంగళూరులోని కేంపెగౌడ ఎయిర్‌పోర్టులో సైన్‌బోర్డులన్నింటి నుంచీ హిందీని తీసేశారు. అక్కడ ఇప్పుడు కన్నడ, ఇంగ్లీషులో మాత్రమే సమాచారం అందిస్తున్నారు. ఈ మార్పునకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా Xలో తెగ వైరల్ అవుతోంది. కొందరు ఈ పనిని మెచ్చుకున్నారు. కానీ చాలామంది ఒక అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తప్పని విమర్శిస్తున్నారు. ఒక యూజర్ ఈ మార్పును ప్రశ్నిస్తూ, “ఇంగ్లీషు, కన్నడ తెలిసిన వాళ్ళు మాత్రమే బెంగళూరు వస్తారని అనుకుంటున్నారా? ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లలో […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON