ప్రఖ్యాత డేర్‌డెవిల్ స్టంట్ క్రియేటర్, ఆస్ట్రియ స్కైడైవర్ ఫెలిక్స్ బామ్‌గార్ట్నర్ అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోయాడు. 56 ఏళ్ల ఉన్న అతను పారాగ్లైడింగ్ చేస్తూ ప్రమాదానికి గురయ్యాడు. 2012లో స్ట్రాటోస్పియర్ నుంచి దూకిన అతను ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అయితే తాజాగా ఇటలీ తీరంలో పారాగ్లైడింగ్ చేస్తూ చనిపోయినట్లు తెలుస్తోంది. ఏ కారణం చేత అతను ప్రాణాలు కోల్పోయాడో ఇంకా స్పష్టంగా తెలియదు. అడ్రియాటిక్ కోస్టు తీరంలో అతను ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. కంట్రోల్ కోల్పోవడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

