కారు ప్రమాదం లో తీవ్రంగా గాయపడి గడిచిన 20 ఏళ్లుగా కోమా లో ఉన్న సౌదీ యువరాజు అల్ వలీద్ బిన్ ఖాలీద్ బిన్ తలాల్ అల్ సౌద్ మృతిచెందారు. ఆయన వయసు ప్రస్తుతం 36 సంవత్సరాలు. శనివారం అల్ వలీద్ కన్నుమూశాడని ‘గ్లోబల్ ఇమామ్స్ కౌన్సిల్’ తెలిపింది. ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. 2005లో ఓ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుంచి కోమాలో ఉన్న యువరాజుకు రియాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స అందించారు.

