భారత వ్యర్థాల నిర్వహణ, సర్క్యులర్ ఎకానమీ రంగంలో అగ్రగామి సాంకేతిక వేదికగా కొనసాగుతున్న హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ‘రీసైకల్’ (Recykal) సంస్థలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వ్యూహాత్మక పెట్టుబడిదారుడిగా చేరారు. బాధ్యతాయుతమైన వ్యర్థాల నిర్వహణను దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడికి ఒక అలవాటుగా మార్చాలనే సంస్థ లక్ష్యానికి సచిన్ తన మద్దతు ప్రకటించారు. రీసైకల్ ఇటీవల ప్రకటించిన 23 మిలియన్ డాలర్ల బ్రిడ్జ్ రౌండ్ పొడిగింపులో భాగంగా ఈ భాగస్వామ్యం కుదిరింది.

