ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి భారీ షాక్ తగిలినట్లైంది. ఎందుకంటే రేపు (జూన్ 2) హైదరాబాద్‌లో తలపెట్టిన సభకు సైబరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించారు. తెలంగాణలో జనసేన పార్టీని విస్తరించేందుకు పవన్ కళ్యాణ్.. హైదరాబాద్‌లో భారీ సభకు ప్లాన్ చేశారు. ఐతే.. కొన్ని కారణాలతో పోలీసులు ఈ సభకు అనుమతి ఇవ్వలేదని తెలిసింది. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు అనేది హాట్ టాపిక్ అవుతోంది.