ఎస్సెల్ గ్రూప్ తరఫున తీసుకున్న రుణాలు, రుణ హామీలకు సంబంధించి గ్యారంటీర్ గా ఉన్న సుభాష్ చంద్ర చెల్లించాల్సిన 22 వేల కోట్లకు బదులుగా దివాళా ప్రక్రియ కింద రూ.6.5 కోట్లు చెల్లిస్తే సరిపోతుందని NCLT సంచలన తీర్పు ఇచ్చింది. దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. అదే సమయంలో ఈ కేసును విచారిస్తున్న ముగ్గురు సభ్యులు ఇచ్చిన ఉత్తర్వులలో భేదాభిప్రాయాలు తలెత్తాయి. దివాలా కేసులో ఎన్సీఎల్టీ ఆగస్టు 25న ఈ మేరకు ఇచ్చిన ఉత్తర్వుపై యూటర్న్ తీసుకుంది. ఉత్తర్వుపై వారం రోజుల్లోపే స్టే విధించింది.

