భారతీయ మూలాలున్న ప్రఖ్యాత అంతరిక్ష యాత్రికురాలు సునీతా విలియమ్స్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. అమెరికాలో దాదాపు 20,000 మందికి పైగా మాజీ సైనికులు పాల్గొన్న, సైనికుల సేవలను ఘనంగా స్మరించుకుంటూ నిర్వహించే ప్రఖ్యాత ‘వెటరన్స్ డే పరేడ్’ వేడుకకు ఆమె గ్రాండ్ మార్షల్ హోదాలో వ్యవహరించారు. న్యూయార్క్‌లోని మాన్హాటన్ ఫిఫ్త్ అవెన్యూలో ఈ భారీ పరేడ్ అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ వేదికపై ఆమె మాట్లాడుతూ, గ్రాండ్ మార్షల్‌గా వ్యవహరించడం తన జీవితంలో ఎంతో గర్వకారణమైన విషయమని అన్నారు.