1893లో చికాగో వేదికగా హిందూ ధర్మ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన వివేకానందుడి స్మారకంగా, 2026లో సీటెల్ నగరంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ప్రఖ్యాత తత్వవేత్త, ఆధ్యాత్మిక గురువు స్వామి వివేకానంద నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని అమెరికాలోని సీటెల్ నగరంలో ఘనంగా ఆవిష్కరించారు. ఒక అమెరికన్ సిటీ గవర్నమెంట్ అధికారికంగా స్వామి వివేకానంద విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. భారత సాంస్కృతిక సంబంధాల మండలి (ICCR) ఈ విగ్రహాన్ని సీటెల్ నగరానికి బహుమతిగా అందించింది.

