ఇండోనేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. పురుషుల విభాగంలో యువ షట్లర్ ఆయుశ్ శెట్టి కూడా ఓటమి పాలయ్యాడు. దక్షిణ కొరియాకు చెందిన అన్ సె యంగ్‌తో జరిగిన పోరులో సింధుకు చుక్కెదురైంది. పురుషుల డబుల్స్‌లో భారత్‌కు చెందిన అర్జున్‌హరిహరణ్ జంట క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. నువ్వానేనా అన్నట్టు సాగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత జంట 16-21,21-15,21-19తో మలేసియాకు చెందిన కాంగ్ ఖాయ్ జోడీని ఓడించింది.