దేశంలో మరోసారి కమర్షియల్ సిలిండర్ల ధరను చమురు సంస్థలు పెంచాయి. ఈ మేరకు దేశ వ్యాప్తంగా 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధరపై రూ. 42 మేర పెరగడంతో, ఇక్కడ కొత్త ధర రూ.3,113.50కి ఎగబాకింది. హైదరాబాద్లో రూ.52 పెరిగి రూ.3,367 కి చేరింది. 5 కిలోల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ సిలిండర్ ధరలను రూ.11 మేర పెంచారు.