ఫైనల్ వంటి కీలక మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ తన అనుభవాన్ని మరోసారి నిరూపించాడు. కేవలం 25 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేశాడు. ఐపీఎల్ కెరీర్‌లో కోహ్లీకి ఇది అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీగా నమోదైంది. ఈ హాఫ్ సెంచరీతో కోహ్లీ ఐపీఎల్ ఫైనల్స్ చరిత్రలో వేగంగా అర్ధశతకం సాధించిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. ఇప్పుడు 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన కోహ్లీ, రోహిత్ శర్మ, క్రిస్ గేల్ సరసన నిలిచాడు.

