అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీ అల్దాస్ జానయ్యపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురితో కూడిన కమిటీ ఏర్పాటు చేసింది. స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ కె. లక్ష్మి నేతృత్వంలో ఐఏఎస్ అధికారులు రాహుల్ రాజ్, యాస్మిన్ బాషా, బి. గోపితో పాటు ప్రజ్వల ఎన్జీవో ప్రతినిధి కృష్ణన్ సభ్యులుగా ఉన్నారు. 15 రోజుల్లో విచారణ పూర్తి సేసి నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కమిటీకి సూచించింది. మహిళా అసిస్టెంట్ ఇచ్చిన ఫిర్యాదులోని ఆరోపణలను కమిటీ క్షుణ్ణంగా పరిశీలించనుంది.