అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఎలాన్ మస్క్, అంతరిక్ష ఆధారిత డేటా సెంటర్ల ప్రస్తావన తీసుకొస్తూ వ్యంగ్యంగా పోస్ట్ చేశారు. “ప్రస్తుతం అంతరిక్షంలోని డేటా సెంటర్లు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. కానీ ఈసారి నా స్పేస్ లేజర్లు పనిచేయలేదని నేను అనుకుంటున్నాను” అని పేర్కొన్నారు. రిపబ్లికన్లకు మద్దతుగా మస్క్ భారీగా నిధులు అందించిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఎన్నికల ప్రచారం కోసం ఆయన దాదాపు రూ.4 వేల కోట్లు విరాళంగా ఇచ్చినట్లు ఇటీవల నివేదికలు వెల్లడించాయి.