అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అమెరికాకు చెందిన ప్రముఖ మేధో మధన సంస్థ ‘సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్’ (CIS) తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం, 2025లో భారతీయ విద్యార్థులకు జారీ చేసిన ఎఫ్-1 స్టూడెంట్ వీసాల సంఖ్యలో ఏకంగా 62 శాతం మేర కోత పడింది. 2024లో భారతీయులకు 58,694 స్టూడెంట్ వీసాలు జారీ కాగా, 2025 నాటికి ఆ సంఖ్య కేవలం 22,149కి పరిమితమైంది.