అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేపింది. రోడ్డు ఐలాండ్‌లోని బ్రౌన్ విశ్వవిద్యాలయంలో ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతుండగా దుండగుడు కాల్పులకు తెగపడ్డాడు. ఇంజనీరింగ్ భవనంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు దుర్మరణం చెందగా 8 మంది గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దుండగుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు

