బ్రహ్మపుత్ర నదిపై చైనా ప్రపంచంలోనే అతి పెద్ద డ్యామ్ నిర్మించనుంది. టిబెట్లో ప్రవహించే బ్రహ్మపుత్రపై భారతదేశపు అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో ఈ నిర్మాణానికి చైనా ఇప్పటికే పనులు చేపట్టింది. శనివారం ఈ పనులు ఆరంభించినట్లు చైనా ప్రధాని లి కియాంగ్ తెలిపారు. నేలను చదును చేసే పనులు ఆరంభించారు. న్యింగ్చీ సిటీకి సమీపంలో నది పల్లపు ప్రాంతంలో భౌగోళికంగా అనువైన ప్రాంతాన్ని ఎంచుకుని చైనా అత్యంత పెద్దదైన ఆనకట్టను నిర్మించడం పట్ల భారతదేశ స్పందన ఏ విధంగా ఉంటుందనేది కీలకం అయింది.

