ఫ్లైదుబాయ్ విమానం ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. విమానంలో భారత పైలట్ స్మిత్ మచ్చర్ పై జరిగిన దాడిలో కోపైలట్ కత్తిని వాడినట్లు ప్రాథమికంగా కథనాలు వచ్చాయి. అయితే అది కత్తి కాదని.. గొడ్డలి అని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. ఆ ఆయుధాన్ని క్రాష్ యాక్స్ గా గుర్తించారు. ఏదైనా అత్యవసర పరిస్థితిలో వాడేందుకు దీన్ని కాక్ పిట్ లో ఉంచుతారు. అంతకు ముందు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా దాడిలో క్రాష్ యాక్స్న ఉపయోగించినట్లు పేర్కొన్నారు.