రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో మంగళ్ పల్లి గ్రామంలో ఉన్న రూ.50 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసి ఒక ప్రైవేటు వ్యక్తి పేరిట మార్చేశారు. సర్వే నంబర్ 96లో ఉన్న 4.25 ఎకరాల సర్కారు స్థలానికి వహీదా బేగం అనే ప్రైవేటు వ్యక్తి పేరుతో అధికారికంగా పట్టా పాసుపుస్తకం జారీ చేయడం అధికారులను దిగ్భ్రాంతికి గురిచేసింది. రెవెన్యూ రికార్డుల్లో మార్పులు ఎలా జరిగాయి, ఈ ఫోర్జరీ వ్యవహారంలో ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో అధికారులు ముమ్మర దర్యాప్తు చేపడుతున్నారు.