నీరు కనిపిస్తే చాలు రైతులు వరి పంట వేస్తున్నారని తెలిపారు. రైతులు వరి నుంచి ఇతర పంటల వైపు మారకపోతే నష్టాలు తప్పవన్నారు. గోదావరి జిల్లాల్లో వరి తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదని, కానీ ఇతర ప్రాంతాల్లో పంట మార్పిడి అవసరమని సూచించారు. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా సాగు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. కంది,రూ.26 వేలు, మినుములు రూ.21 వేలు, జొన్న రూ.16 వేల ఆదాయం సాధ్యమని ఏపీ శాసనసభలో అడిగిన ప్రశ్నకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం ఇచ్చారు.

