నేపాల్‌లోని త్రిశూలీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న ఓ గ్రామీణ బ్యాంకు నుంచి భారీ మొత్తంలో నగలు, ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బురదతో నిండిన వరద పోటెత్తిన ఘటనలో.. త్రిశూలీ దుంగేలో ఉన్న అగ్రికల్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ బ్రాంచ్ ధ్వంసమైంది. బ్యాంకు నుంచి లాకర్లను తీసేందుకు సుమారు 8 గంటల ఆపరేషన్ చేపట్టారు. వివిధ లాకర్లలో ఉన్న సుమారు 1.5 కోట్ల నగదు, సుమారు 50 కోట్ల విలువైన బంగార ఆభరణాలను బ్యాంకు ఆఫీసర్లు స్వాధీనం చేసుకున్నారు.

