
జ్యోతి మల్హోత్ర నుంచి మూడు ఫోన్ల నుంచి,, కీలకమైన డేటా స్వాధీనం చేసుకున్నట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. పోలీసులు రికవరీ చేసిన డేటాలో ఆమె చాట్ రికార్డులు, కాల్ వివరాలు, వీడియో ఫుటేజ్ తో పాటు నలుగురు ఏజెంట్లతో ఆమె జరిపిన ఆర్థిక లావాదేవీల వివరాలు వెలుగులోకి వచ్చాయి. జ్యోతి మల్హోత్రా కు నలుగురు పాకిస్తానీ నిఘా కార్యకర్తలతో ప్రత్యక్ష సంబంధం ఉందని ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించింది. ఆమె పాకిస్తాన్ లో పర్యటించనప్పుడల్లా ప్రత్యేక మర్యాదలు జరిగేవని, పోలీసు అధికారి తెలిపారు.