సౌరవ్ గంగూలీ ఆసియా కప్ భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌పై కామెంట్స్ చేశాడు. ‘క్రీడలు కొనసాగాలి. అలాగే, పహల్గామ్ వంటి ఉగ్రవాద దాడులు జరగకూడదు. ఉగ్రవాదం జరగకూడదు, దానిని ఆపాలి. భారతదేశం దీనిపై కఠినమైన వైఖరి తీసుకుంది, కానీ అది గతానికి సంబంధించిన విషయం. ఇప్పుడు ఆటలు ముందుకు సాగాలి. ఆటలు కొనసాగాలి’ అని సౌరవ్ గంగూలీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే గంగూలీ వ్యాఖ్యలపై భారతీయులు ఆగ్రహంగా ఉన్నారు. విమర్శలు చేస్తున్నారు. ప్రజల మనోభావాలు పట్టవా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

