అస్మిత చాలిహా సంచలనం సృష్టించింది. తన కెరీర్లో తొలిసారి బీడబ్ల్యూఎఫ్ టూర్ టైటిల్ను నెగ్గింది. కొరియా మాస్టర్స్ 300 ఫైనల్లో చైనా క్రీడాకారిణిపై అస్మిత విజయం సాధించింది. తొలి గేమ్ను కోల్పోయినప్పటికీ వరుసగా రెండు గేముల్లో ప్రత్యర్థిని ఓడించింది. చివరికి అస్మిత 14-21, 21-14,21-14 తేడాతో హాన్పై గెలిచింది.