
నిజామాబాద్ జిల్లా సారంగపూర్ అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగినట్లు, రౌడీ షీటర్ రియాజ్ హతం అయినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని నిజామాబాద్ సీపీ సాయి చైతన్య తెలిపారు. నిజామాబాద్‌లో ఎలాంటి ఎన్కౌంటర్ జరగలేదని, నిందితుడు రియాజ్‌పై ఎలాంటి కాల్పులు జరపలేదని తెలిపారు. ప్రస్తుతం అతడు ప్రాణాలతోనే ఉన్నాడని, తాము అదుపులోకి తీసుకున్నామని వివరించారు. నిజామాబాద్‌లో ఎలాంటి కాల్పులు జరగలేదని సీపీ స్పష్టం చేశారు.